ఐశ్వర్య పిస్సే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐశ్వర్య పిస్సే
వ్యక్తిగత సమాచారం
జన్మనామంఐశ్వర్య పిస్సే
జననం (1995-08-14) 1995 ఆగస్టు 14 (వయసు 29)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
క్రీడ
దేశంభారతదేశం
క్రీడసర్క్యూట్ రేసింగ్ / ఆఫ్ రోడ్ రేసింగ్ / ర్యాలీ

ఐశ్వర్య పిస్సే.(14 ఆగస్టు 1995) ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ రేసర్. మోటార్ సైకిల్ విభాగంలో జరిగే మోటార్ స్పోర్ట్స్‌లో మొట్ట మొదటి సారిగా ప్రపంచ టైటిల్ సాధించిన భారతీయ అథ్లెట్ ఆమె. 2019లో జరిగిన FIM ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అలాగే  జూనియర్స్ విభాగంలో రెండో స్థానం సాధించింది.  ఈ పోటీలో  వేర్వేరు భూభాగాలున్న ప్రాంతాలను కలుపుకుంటూ సుమారు 800 - 1000 కిలోమీటర్ల దూరాన్ని రెండు రోజులలో ఛేదించాలి. 2017, 2018 సంవత్సరాల్లో పిస్సే నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ను సాధించింది.  2016 ,2017 సంవత్సరాలకు గానూ రోడ్ రేసింగ్, ర్యాలీ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. 2018 లో స్పెయిన్‌లో జరిగిన బాజా అరగోన్ ప్రపంచ ర్యాలీలో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా ఐశ్వర్య ఘనత సాధించింది.[1]

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

ఐశ్వర్య పిస్సే బెంగళూరులో పుట్టి పెరిగింది . ఆమె పాఠశాలలో ఉన్నప్పుడే భవిష్యత్తులో బైకర్‌ కావాలి అని నిర్ణయించుకుంది.  కానీ ఆమె సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. దీంతో మొదట్లో ఆమె తల్లిదండ్రులు, తాతగారి కుటుంబం ఆమె అందరిలా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందని కోరుకున్నారు..[2] అప్పటికి, దేశంలో చాలా కొద్ది మంది మహిళా రేసర్లు మాత్రమే ఉన్నారు. అయితే చివరికి ఆమె తల్లి తన బిడ్డ కంటున్న కలలకు వారధిగా నిలిచారు.[3] తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నపుడు పిస్సే తల్లిదండ్రులు విడిపోయారు. పిస్సే ప్లస్ టూ పరీక్షలు సరిగ్గా రాయలేదని తన తండ్రి ఇంట్లోంచి వెళ్లిపొమ్మని అన్నప్పుడు తన తల్లి ఉన్న చోటుకు వెళ్లిపోయింది. తన జీవితంలో తగిన ప్రయోగాలు చేసేందుకు అదే తగిన సమయమని భావించిన ఆమె బైక్ రైడింగ్ మొదలు పెట్టింది. కొద్ది రోజులకే వారాంతాలలో తన స్నేహితులతో కలిసి బైక్ ట్రిప్స్‌కి వెళ్ళేది. ఆపై ఎంటీవి నిర్వహించిన ఓ షోలో భాగంగా గుజరాత్ నుంచి చిరపుంజీ వరకు 8 వేల కిలోమీటర్ల రోడ్ 24 రోజుల్లో పూర్తి చేసింది. 2017లో ఆమెను సంప్రదించిన టీవీఎస్ రేసింగ్ బృందం ఆర్థికంగా అన్ని విధాల సాయం చేసి ప్రోత్సహిస్తూ పిస్సేలో మరింత విశ్వాసాన్ని పెంచారు.[2]

వృత్తిపరమైన విజయాలు

[మార్చు]

పిస్సే బెంగళూరులోని అపెక్స్ రేసింగ్ అకాడమీ నుండి 2016 సంవత్సరంలో పట్టా  సాధించింది. ఆపై టివిఎస్ వన్ మేక్ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టి తొలి విజయాన్ని సాధించింది. 2016,2017, 2019 సంవత్సరాల్లో ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా మోటర్‌స్పోర్ట్స్  అవార్డుతో ఆమెను సత్కరించింది.[4]

2017 లో, అత్యంత క్లిష్టమైన రైడ్ ది హిమాలయస్‌లో విజయం సాధించింది. 2017లో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్‌లో కూడా విజేతగా నిలిచింది.

2018లో కూడా పిస్సే నేషనల్ ర్యాలీ ఛాంపియన్షిప్ సాధించింది.  అదే ఏడాది బాజా అరగోన్ ర్యాలీని పూర్తి చేసిన తొలి భారతీయరాలిగా నిలిచింది. కానీ ఆ తరువాత జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆ ఈవెంట్ నుంచి మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. అప్పటికే 2017లో జరిగిన తీవ్ర ప్రమాదం కారణంగా కాలర్ బోన్ దెబ్బతింది. ఆ తరువాత ఆమెకు జరిగిన రెండో పెద్ద ప్రమాదం ఇది. [5] శస్త్ర చికిత్స తర్వాత 2019లో కఠోరమైన శిక్షణ ద్వారా తిరిగి తన కెరియర్‌ను పునర్నిర్మించుకుంది. ఆపై FIM వరల్డ్ కప్‌లో పాల్గొని విజయం సాధించింది. మెటార్ స్పోర్ట్స్ విభాగంలో ప్రపంచ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. [6]

మూలాలు

[మార్చు]
  1. "मोटरबाइक रेसिंग में परचम लहरातीं ऐश्वर्या". BBC News हिंदी (in హిందీ). Retrieved 2021-02-20.
  2. 2.0 2.1 "Racer Aishwarya Pissay swings into top gear". The Week (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20.
  3. May 13, Tridib Baparnash / TNN /; 2020; Ist, 21:44. "No more a man's world, says World Cup winning racer Aishwarya Pissay | Racing News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  4. "Press release of the FMSCI Awards 2019 – FMSCI" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-27. Retrieved 2021-02-20.
  5. "Aishwarya Pissay's long ride from reality television to winning a world title in motorsports". The Indian Express (in ఇంగ్లీష్). 2019-08-14. Retrieved 2021-02-20.
  6. Aug 13, Hindol Basu / TNN / Updated:; 2019; Ist, 09:18. "Aishwarya Pissay 1st Indian to win world title in motorsports | Racing News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)