ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ICICI Prudential Mutual Fund
TypePublic limited company
పరిశ్రమMutual Funds
స్థాపన1993
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంMumbai, India
Areas served
India
Key people
Mr. Nimesh Shah[1]
(Managing Director & CEO), Mr. S. Naren[2]
(Chief Investment Officer), Mr. Rahul Goswami
(Chief Investment Officer - Fixed Income)
ProductsMutual Fund, Portfolio Management Services, Advisory Services, Real estate investing
Total assetsIncrease 1,75,881 crore (US$22 billion)
(March 31, 2016)
Number of employees
1000-1500

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ దేశంలో అతిపెద్ద ఎసెట్ మేనేజేమెంట్ కంపెనీ (ఎఎంసి) పొదుపులకు, పెట్టుబడులకు మధ్య ఖాళీని పూడ్చడంపై, సింపుల్గా ఉండే, సంబంధిత పెట్టుబడి పరిష్కారాల శ్రేణి ద్వారా ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించడంపై దృష్టిపెడుతోంది.[3][4]

చరిత్ర[మార్చు]

మూలం[మార్చు]

ఎఎంసి అనేది భారతదేశంలో ప్రఖ్యాత, ఆర్థిక సేవల్లో విశ్వసనీయమైన పేరు గల ఐసిఐసిఐ బ్యాంక్కి, యుకెలో ఆర్థిక సేవల రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ప్రుడెన్షియల్ పిఎల్సికి మధ్య జాయింట్ వెంచర్.

భారతదేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయి నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో కార్పొరేట్ కార్యాలయం గల ఎఎంసి గణనీయంగా వృద్ధి సాధించింది; 1998లో జాయింట్ వెంచర్ ప్రారంభించినప్పుడు 2 ప్రాంతాలు, 6 మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం దాదాపు 120 ప్రాంతాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 1.9 మిలియన్ల మందిగి పైగా ఇన్వెస్టర్లకు సేవలు అందిస్తోంది.[5]

ఇన్వెస్టర్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్న సంస్థకు నేడు ఇన్వెస్ట్మెంట్ నైపుణ్యం, వనరులు, ప్రాసెస్ ఓరియెంటేషన్లతో కూడిన అనుకూలమైన మిశ్రమం ఉంది.

సంస్థ[మార్చు]

ప్రముఖ వ్యక్తులు[6][మార్చు]

బోర్డు ఆఫ్ డైరెక్టర్స్: ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ[మార్చు]

 • మిస్. చందా కొచ్చర్- చైర్పర్సన్
 • శ్రీ. సురేష్ కుమార్
 • శ్రీ. విజయ్ ఠక్కర్
 • శ్రీ. ఎన్.ఎస్. కన్నన్
 • శ్రీ. సి.ఆర్. మురళీధరన్
 • శ్రీ. నిమేష్ షా
 • శ్రీ. గయ్ స్ట్రాప్[7]
 • మిస్. లక్ష్మీ వెంకటాచలం
 • శ్రీ ఎస్. నరేన్

మేనేజ్మెంట్ టీమ్

 • శ్రీ. బి. రామకృష్ణ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
 • శ్రీ. రాఘవ్ అయ్యంగార్- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ రిటైల్, ఇన్స్టిట్యూషనల్ బిజినెస్
 • శ్రీ. హేమంత్ అగర్వాల్ – హెడ్ ఆఫ్ ఆపరేషన్స్
 • శ్రీ. వివేక్ శ్రీధరన్ – హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ బిజినెస్
 • శ్రీ. అమర్ షా- హెడ్ ఆఫ్ రిటైల్ బిజినెస్
 • మిస్. సుప్రియా సప్రే – హెడ్ ఆఫ్ కాంప్లియన్స్ అండ్ లీగల్
 • శ్రీ. అభిజిత్ షా – హెడ్ ఆఫ్ మార్కెటింగ్, డిజిటల్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్
 • శ్రీ. అమిత్ భోసలే – హెడ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్
 • శ్రీ. నిఖిల్ భెండే – హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్
 • శ్రీ అడిల్ బక్షీ – హెడ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్
 • శ్రీ. లలిత్ పోప్లీ – హెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 • రాహుల్ రాయ్ – హెడ్ – రియల్ ఎస్టేట్ బిజినెస్

ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్

 • శ్రీ. ఎస్. నరేన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ [8]
 • శ్రీ. రాహుల్ గోస్వామి – చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ – ఫిక్స్డ్ ఇన్కమ్
 • శ్రీ. రాహుల్ రాయ్ - హెడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్

ప్రాడక్ట్లు , సర్వీసులు[మార్చు]

మ్యూచువల్ ఫండ్ విభాగంలో ఆస్తి తరగతుల్లో ఎఎంసి గణనీయంగా ఎసెట్స్ మేనేజ్మెంట్ (ఎయుఎం) నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న క్లయింట్లకు అంతర్జాతీయ అడ్వయిజరీ మేండేట్స్తో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల కోసం పోర్టుఫోలీయో మేనేజ్మెంట్ సర్వీసులను, రియల్ ఎస్టేట్ డివిజన్ని కూడా ఎఎంసి నిర్వహిస్తోంది.[9][10]

మ్యూచువల్ ఫండ్[మార్చు]

మ్యూచువల్ ఫండ్ ప్రాథమికంగా రిటైల్ ఇన్వెస్టర్లకు సేవలందిస్తుంది.[11] రిటైల్ ఇన్వెస్టర్లు వాళ్ళ యొక్క జీవిత చక్రం లక్ష్యాలను సాధించుకునేలా సహాయపడే ఆర్థిక పరిష్కారాలు అందించడం దీని లక్ష్యం. మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ల యొక్క మంచి వైవిధ్యంగల పోర్టుఫోలియోకు దారితీసేలా కస్టమర్ల అవసరాలను తీర్చేలా రూపొందించబడిన ప్రొడక్ట్లను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి ప్రవేశపెట్టింది.

పోర్టుఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు[మార్చు]

నికర విలువ అధికంగా గల ఇన్వెస్టర్లకు అత్యధిక రాబడులు అందించడం లక్ష్యంతో మరింత ఏకాగ్రత గల పోర్టుఫోలియోలో పెట్టుబడి పెట్టేందుకు పోర్టుఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు అనుమతిస్తాయి. 2000 సంవత్సరంలో, సర్వీసు అందించండలో మొట్టమొదటి సంస్థాగత పార్టిసిపేటింగ్గా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి ఉంది. 10 సంవత్సరాలకు పైగా విజయవంతమైన ఘన చరిత్ర ఇప్పుడు ఉంది.

రియల్ ఎస్టేట్ బిజినెస్[మార్చు]

అత్యధిక నికర విలువ గల ఇన్వెస్టర్లకు, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసితో రియల్ ఎస్టేట్ డివిజన్ సేవలందిస్తోంది. 2007 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ఎన్వెస్ట్మెంట్ సీరీస్ పోర్టుఫోలియోతో ఈ సేవలు ప్రారంభించింది.[12]

అంతర్జాతీయ అడ్వయిజరీ[మార్చు]

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసిలో, మాకు ప్రత్యేకంగా విదేశీ సలహా యూనిట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు మా పెట్టుబడి సామర్థ్యాలను అందించడానికి ఇది మాకు సహాయపడుతోంది. సంస్థ యొక్క అంతర్జాతీయ వ్యాపార కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు కొన్నిటిని ఈ కింద ఇస్తున్నాము.[13]

 • అంతర్జాతీయ క్లయింట్లకు సలహా సేవలు అందిస్తున్న కొద్ది భారతీయ ఎఎంసిల్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎఎంసి ఒకటి.
 • 2006 నుంచి విదేశీ సలహా వ్యాపారం విజయవంతంగా నిర్వహిస్తోంది.
 • జపాన్, తైవాన్, ఐరోపా, మిడల్ ఈస్ట్ల్లో విస్తరించి వున్న క్లయింట్లు.
 • ఫండ్ స్వరూపాలు, వేరే అకౌంట్ల రూపంలో విభిన్న క్లయింట్ విభాగాల; ఇండియన్ ఈక్విటీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ని కవర్ చేస్తున్నాయి.

ప్రధాన పోటీదారులు[మార్చు]

మ్యూచువల్ ఫండ్ రంగంలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్కి గల కొద్ది పోటీ వాటిల్లో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్, బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్, యుటిఐ మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి.[14]

ప్రస్తావనలు[మార్చు]

 1. "Budget 2016 must look at innovative ways to create demand & jobs, improve trade". Economic Indiatimes. 12 Feb 2016. Retrieved 19 Feb 2016.
 2. "This is a great year for mutual fund investors, a bad year for traders: S Naren, ICICI Prudential AMC". Economic Indiatimes. 12 Feb 2016. Retrieved 19 Feb 2016.
 3. "Average AUM". AMFI India. Retrieved 18 Feb 2016.
 4. "ICICI Prudential Long Term Equity: Top-class performer, consistently". The Hindu - BusinessLine. 13 Feb 2016. Retrieved 19 Feb 2016.
 5. "Mutual Fund". ICICI Prudential AMC. Archived from the original on 11 జూలై 2016. Retrieved 18 Feb 2016.
 6. "Management Team". ICICI Prudential AMC. Archived from the original on 8 జూలై 2016. Retrieved 18 Feb 2016.
 7. "Nimesh Shah: Make most of volatility". MydigitalFC. 19 Jun 2015. Archived from the original on 21 జూన్ 2015. Retrieved 23 Feb 2016.
 8. "Sankaran Naren of ICICI Prudential MF does things pre-mortem than post-mortem". Forbes India. 16 October 2012. Archived from the original on 17 సెప్టెంబర్ 2016. Retrieved 23 Feb 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 9. "About ICICI Prudential Mutual Funds". ICICI Prudential AMC. Archived from the original on 8 జూలై 2016. Retrieved 18 Feb 2016.
 10. "Nimesh Shah, MD and CEO, ICICI Prudential Asset Management Views on Current State of Market". Indian SHare Tips. Retrieved 23 Feb 2016.
 11. "Q & A: Nimesh Shah, MD & CEO, ICICI Prudential AMC". Mutual Fund News Group. 13 October 2010. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 23 Feb 2016.
 12. "PMS (Portfolio Management services)". ICICI Prudential AMC. Archived from the original on 11 మే 2016. Retrieved 18 Feb 2016.
 13. "About Real Estate Investment". ICICI Prudential AMC. Archived from the original on 19 జూలై 2016. Retrieved 18 Feb 2016.
 14. "Top Fund Houses". NDTV Profit. 18 Feb 2016. Archived from the original on 21 జూన్ 2016. Retrieved 18 Feb 2016.

ఎక్స్టర్నల్ లింకులు[మార్చు]