ఒక్కడొచ్చాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక్కడొచ్చాడు
దర్శకత్వంసూరజ్
రచనసూరజ్
నిర్మాతజి.హరి
తారాగణం
ఛాయాగ్రహణంరిచర్డ్ నాథన్
కూర్పుసెల్వ ఆర్కే
సంగీతంహిప్హాప్ తమిజా
నిర్మాణ
సంస్థ
హరి వెంకటేశ్వర పిక్చర్స్
విడుదల తేదీ
2016 డిసెంబరు 23 (2016-12-23) [1]
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఒక్కడొచ్చాడు 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో 'కత్తి సండై' పేరుతో విడుదలైంది. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై జి.హరి నిర్మించిన ఈ సినిమాకు సూరజ్ దర్శకత్వం వహించాడు. విశాల్, తమన్నా, జగపతిబాబు, వడివేలు, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 23 డిసెంబర్ 2016న విడుదలైంది.[2]

కథ[మార్చు]

పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) మొదటి చూపులోనే దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. ఆమె డిజిపి చంద్రబోస్ (జగపతి బాబు) చెల్లెలు. దివ్య తన ప్రేమ విషయం అన్నయ్య చంద్రబోస్‌కి తెలియజేయగా అతను వారి ప్రేమని అంగీకరించి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గర నుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. అర్జున్ ఎందుకు డిజిపిని టార్గెట్ చేశాడు ? అసలు డీజీపీ దగ్గర అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది ? అర్జున్ అసలు ఎవరు ? అనేది మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హరి వెంకటేశ్వర పిక్చర్స్
  • నిర్మాత: జి.హరి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురజ్
  • సంగీతం: హిప్‌హాప్ తమిళ
  • సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ఎమ్.నథన్

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 December 2016). "Vishal's Okkadochadu gets U certificate, release on December 23" (in ఇంగ్లీష్). Archived from the original on 30 ఆగస్టు 2021. Retrieved 30 August 2021.
  2. The Times of India (23 December 2016). "Okkadochadu review highlights" (in ఇంగ్లీష్). Archived from the original on 30 ఆగస్టు 2021. Retrieved 30 August 2021.
  3. India Herald (23 December 2016). "ఒక్కడొచ్చాడు : రివ్యూ". Archived from the original on 30 ఆగస్టు 2021. Retrieved 30 August 2021.