ఒడ్డాణము
స్వరూపం
ఒడ్డాణము అనేది పండుగలు, ముఖ్యమైన కుటుంబ వేడుకలు, అలాగే వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో దక్షిణ భారత మహిళలు అలంకారంగా ధరించే నడికట్టు లేదా దట్టి.
ఇది దక్షిణ భారతదేశ వివాహాలలో ఒకరి సామాజిక స్థాయికి లేదా ఆర్థిక స్థాయికి చిహ్నంగా కూడా చూడబడుతుంది. పెళ్లికూతుర్లు ధరించే అత్యంత బరువైన ఆభరణాలలో ఒడ్డాణ మొకటి. వాళ్ళు దీన్ని ధరించకుండా దక్షిణ భారత వివాహాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.[1]
వ్యుత్పత్త్యర్థము
[మార్చు]కొందరు భాషావేత్తల లేదా నిఘంటువుల ప్రకారం, ఒడ్డాణము అనే పదం సంస్కృతపదమైన ఓఢ్యాణము యొక్క వికృతిరూపము అని చెప్పబడినది[2]. కానీ, ఇంకొందరి సిద్ధాంతముల ప్రకారం, ఒడ్డాణము అనే పదము ఒడి (నడుము) మరియు ఆణము (చుట్టు/కట్టు) అనే అచ్చతెలుగు పలుకుల నుండే పుట్టినది అని నమ్మకము.
- ↑ Chopra, Pran Nath (1992). Encyclopaedia of India: Pondicherry. Rima Publishing.
- ↑ "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - Andhrabharati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary". andhrabharati.com. Retrieved 2024-08-23.