ఒమన్‌లో హిందూమతం
ఒమన్‌లో హిందూ మతం మైనారిటీ మతం. దాని జనాభాలో 5.5% మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [1] మధ్యప్రాచ్యంలో హిందూ మైనారిటీ ఉన్న ఏకైక దేశం, ఒమన్. [2] [3] ఒమన్‌లోని హిందువులకు హిందూ మహాజన్ దేవాలయం అనే మతపరమైన సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. [3]
చరిత్ర
[మార్చు]1507లో కచ్చీ మాట్లాడే హిందువులు భారతదేశంలోని కచ్ ప్రాంతం నుండి మస్కట్‌కు రావడంతో హిందూమతం ఒమన్‌లోకి అడుగుపెట్టింది. 19వ శతాబ్దం తొలిలో ఒమన్‌లో కనీసం 4,000 మంది హిందువులు ఉన్నారు. 1895లో మస్కట్‌లోని హిందూ కాలనీ ఇబాధీల దాడికి గురైంది. దాంతో 1900 నాటికి హిందువుల సంఖ్య 300కి తగ్గింది. ఒమన్ స్వాతంత్ర్యం సమయంలో, ఒమన్‌లో కొన్ని డజన్ల మంది హిందువులు మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు హిందువులు నివసించిన అల్-వాల్జాత్. అల్-బన్యన్ ప్రాంతాల్లో ఇప్పుడు హిందువులు లేరు. [4]
జనాభా వివరాలు
[మార్చు]మధ్యప్రాచ్యంలో స్వదేశీ హిందూ జనాభా ఉన్న ఏకైక దేశం ఒమన్. ఒమన్ పౌరసత్వంతో ఒమన్‌లో కనీసం 1,000 మంది భారతీయులు (ఎక్కువగా హిందువులు) ఉన్నారు. [2] [3] CIA ప్రకారం, జనాభాలో 2,59,780 మంది హిందువులు (5.5% )ఉన్నారు. వీరంతా ప్రధానంగా వలసదారులు. [1]
దేవాలయాలు
[మార్చు]ఒమన్‌లో అధికారికంగా గుర్తించబడిన హిందూ దేవాలయాలు రెండు ఉన్నాయి. [3]
- ఒమన్‌లోని మస్కట్‌లోని శివాలయం మధ్య ప్రాచ్యం లోని పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. [5]
- మస్కట్‌లోని కృష్ణ దేవాలయం. [6]
ఒమన్‌లోని ప్రసిద్ధ హిందువులు
[మార్చు]- కానాక్సీ ఖిమ్జీ - ప్రపంచంలోని ఏకైక హిందూ షేక్ [7]
- సూరజ్ కుమార్, క్రికెటర్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Middle East OMAN". CIA The World Factbook.
- ↑ 2.0 2.1 "UNIVERSAL PERIODIC REVIEW 2010" (PDF). Retrieved 19 December 2020.
- ↑ 3.0 3.1 3.2 3.3 "International Religious Freedom Report Oman for 2011" (PDF). Archived from the original (PDF) on 15 ఏప్రిల్ 2021. Retrieved 19 December 2020. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "OMAN" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ J.E. Peterson,Oman's diverse society: Northern Oman, Middle East Journal, Vol. 58, Nr. 1, Winter 2004
- ↑ Staff Report (19 December 2020). "Modi visits 125-year-old Shiva temple". GulfNews. Retrieved 14 February 2018.
- ↑ "PM Modi to visit 200-year old Shiva temple in Muscat". dnaindia. 12 February 2018. Retrieved 19 December 2020.
- ↑ Runa Mukherjee Parikh (11 May 2013). "World's only Hindu Sheikh traces his roots to Gujarat". The Times of India. Retrieved 19 December 2020.