Jump to content

రైట్ సోదరులు

వికీపీడియా నుండి
(ఓర్విల్లే రైట్ నుండి దారిమార్పు చెందింది)
రైట్ సోదరులు
జననంఓర్విల్లే: (1871-08-19)1871 ఆగస్టు 19 , డేటన్, ఒహియో
విల్బర్: (1867-04-16)1867 ఏప్రిల్ 16 , మిల్‌విల్లీ, ఇండియానా
మరణంఓర్విల్లే: 1948 జనవరి 30(1948-01-30) (వయసు 76), డేటన్
విల్బర్: 1912 మే 30(1912-05-30) (వయసు 45), డేటన్
వృత్తిఓర్విల్లే: ప్రింటర్/ప్రచురణకర్త, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు
విల్బర్: సంపాదకుడు, సైకిల్ రిటైలర్/తయారీదారు, విమానం సృష్టికర్త/తయారీదారు, పైలట్ శిక్షకుడు
జీవిత భాగస్వామిలేరు (ఇద్దరికి)

రైట్ సోదరులు ఓర్విల్లే (1871 ఆగస్టు 19 - జనవరి 30, 1948), విల్బర్ (1867 ఏప్రిల్ 16 - మే 30, 1912) ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు, విమాన సృష్టికర్తలు, విమాన చోదక మార్గదర్శకులు. వీరు ప్రపంచపు మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి 1903 డిసెంబరు 17 న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 1905 నుండి 1907 వరకు ఈ సోదరులు వారి ప్లయింగ్ యంత్రాన్ని మొదటి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానముగా అభివృద్ధి పరచారు. ప్రయోగాత్మక విమానాలను తయారు చెయ్యడం మొదటిసారి కాకున్నా, రైట్ సోదరులు స్థిర వింగ్ ఆధారితంగా విమాన నియంత్రణను సాధ్యం చేయటం మొదట కనిపెట్టినదే.

చిత్రమాలిక

[మార్చు]