ఓలేటి శ్రీనివాస శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓలేటి శ్రీనివాస శర్మ ఆంధ్ర కథా సరిత్సాగరము రచించిన ఓలేటి త్రయం లో ఒకరు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన ఓలేటి సూర్యానారాయణ శాస్త్రి, భాస్కరమ్మ దంపతులకు 1942లో జన్మించారు. భార్య - వేంకట సీతామహాలక్ష్మీ.

వృత్తి - దంతులూరి వేంకటరాయపరాజోన్నత పాఠశాల, కోలంక నందు ప్రథమ శ్రేణి తెలుగు పండితుడిగా పనిచేసి 2000 సంవత్సరంలొ పదవీవిరమణ చేశారు. జ్యోతిషం, వాస్తు

రచనలు -

 1. ఆఖువాహనుడు (వచనము) (ముద్రితము)
 2. శ్రీ సత్యదేవశతకము (ముద్రితము)
 3. వ్యాకరణ చంద్రిక (6-7-8 తరగతులకు) (ముద్రితము)
 4. వేంకటేశ్వరశతకము (ముద్రితము)
 5. పూర్వం ఆంధ్ర కథా సరిత్సాగరమును ఓలేటి వేంకట రామశాస్త్రి 1-5 లంబకములు, ఓలేటి సూర్యానారాయణ శాస్త్రి 7-18 లంబకములు పూర్తిచేసిన తరువాత మిగిలిన 6వ లంబకము (మదనమంచుక లంబకము) పూర్తి చేసి ఆ గ్రంథానికి పూర్ణత్వము కల్పించిరి. ఆయన తన పూర్వికులకు యశః కాయము లబించునన్న తలంపుతో 6వ లంబకము 2009 నాటికి పూర్తిగావించి ముద్రణము గావించితిరి. (ముద్రితము)
 6. పద్మావతి పరిణయము (అముద్రితము)
 7. కావ్యకన్యక (అముద్రితము)
 8. ఖండకావ్యములు (అముద్రితము)
 9. గోచార ఫలదర్శినిస్త్రీ (అముద్రితము)
 10. స్త్రీ (అముద్రితము)
 11. విశ్వనాథనాయకుడు (నాటకం) (అముద్రితము)
 12. ఆధునిక వాస్తు ఖండన (చర్చగావించి ముద్రించవలసియున్నది) (అముద్రితము)

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]