Jump to content

ఓవీఎం 6948 కెమెరా

వికీపీడియా నుండి
కంపనీ లోగో

ఓవీఎం 6948 కెమెరా ప్రపంచంలోని అతి చిన్న, అత్యాధునిక కెమెరా.[1]

విశేషాలు

[మార్చు]

ఓమ్నీ విజన్ ఈ కెమెరా తయారు చేసింది. ఓమ్నివిజన్ టెక్నాలజీస్ మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల్లో ఉపయోగం కోసం అధునాతన డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీలను, ఉత్పత్తులను రూపొందించి అభివృద్ధి చేసే సంస్థ. ఈ కెమెరా గిన్నిస్ రికార్డును కూడా సృష్టించింది.[2] ఇది కేవలం 0.65 మిల్లీమీటర్ల వెడల్పే ఉంటుంది. వైద్య రంగంలో డాక్టర్లకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ల సమయంలో ఇది ఉపకరిస్తుంది.[3] 120 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ, 200/200 పిక్సెల్స్ రెజల్యూషన్, వెలుతురు తక్కువగా ఉన్నా స్పష్టమైన ఫోటోలను చూపడం దీని ప్రత్యేకతలు.[4]

వేలిపై పెట్టుకొని దగ్గరగా చూస్తే తప్ప అది కెమెరా అన్న విషయం కూడా అర్థం కాదు. ఇది 0.575mm x 0.575mm X 0.232mm సైజ్, 200 x 200 రిజల్యూషన్ వీడియోను తీయగలదు అలాగే సెకనుకు 30 …ఫ్రేమ్‌ల వరకు (fps) తీయగల ఇమేజ్ అర్రేను కలిగి ఉంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 admin. "గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న కెమెరా సెన్సార్ | VASTAVAM" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-11.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "OmniVision OV6948 sets Guinness world record for the smallest camera sensor". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-10-28. Retrieved 2020-05-11.
  3. readwhere (2019-10-30). "Vaartha Online Edition జాతీయo - రికార్డు కెక్కిన అతి చిన్న కెమెరా". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-10-31. Retrieved 2019-10-31.
  4. "రికార్డు కెక్కిన సూక్ష్మ.. అత్యాధునిక కెమెరా - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-05-11.

బాహ్య లంకెలు

[మార్చు]