ఔషద మొక్కలు ... వాటి సాగు విధానము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{{ఔషధ మొక్కలు -- వాటి సాగు విధానము}}

కలబంద

కొన్ని ప్రాంతాలలో దీనిని "కూటి కలబంద" అని అంటారు. దీని శాస్త్రీయ నామము 'అలోవిరా'. ఇది ఎడారి మొక్క. నీటి వసతి లేకున్నా ఇది తట్టు కోగలదు. నీటి వసతితో కూడా సాగు చేయ వచ్చు. నీటి వసతితో సాగు చేస్తే దిగుబడి ఎక్కువ వుంటుంది. నీరు నిలవని అన్ని ప్రాంతాలలో దీనిని సాగు చేయ వచ్చు. దీని ఆకులు సుమారు ఒక అంగుళం మందం కలిగి కలిగి వుంటుంది. అందులో వుండే పారదర్శక పదార్థమే ఔషధాల కొరకు ఉపయోగిస్తారు. పిలకల ద్వారా దీనిని ప్రవర్థనం చేయవచ్చు. దీని పెద్ద మొక్క చుట్టు అనేక పిలకలు వస్తాయి. వాడిని తీసి నాట వచ్చు. దీని ఆకులను గాని, ఆకుల మధ్యలోవుండే 'జెల్ ' పదార్థాన్ని వేరు చేసిగాని అమ్ముకోవచ్చు. దీనిని ప్రతి సౌందర్య సాధన ఉత్పత్తులైన సబ్బులు, ముఖానికి రాసుకునే క్రీములు, అనేక రకములైన ఔషధాలలో ఉపయోగిస్తారు. దీని పెరుగుదల తక్కువ. నీటి వసతి కింద పెంచే టప్పుడు దీనిలో కూరగాయల పంటలను అంతర పంటలుగా వేసుకుంటే ప్రత్యేకంగా దీనికి ఎరువులు వేయ నవసరంలేకుండా పెరుగుతుంది. నీరు నిలవ వుండని అన్ని రకాల నేలలు దీనికి అనుకూలమె.

వస

పల్లెల్లో దీనిని వజ అని కూడా పిలుస్తారు. ఇది దుంప జాతి మొక్క. వరి పండించే అన్ని రకాల నేలలు దీనికి అనుకూలమే. దీని ఆకులు సుమారు ఒక అంగుళం మందం వుండి సుమారు ఒకటి.... రెండడుగుల పొడవు వుంటాయి. కూరగాయ తోటలకు పెట్టినట్టే దీనికి కూడా నీటి తడులివ్వాలి. తల్లి దుంపలకున్న చిన్న పిలక దుంపలతో దీనిని ప్రవర్థనం చేయ వచ్చు. నాటిన సుమారు పది నెలలకు దుంపలు తయారవుతాయి. తయారయిన దుంపలను త్రవ్వి తీసి దానికున్న కాండాని, చిన్న వేరులను తీసి వేసి, ఆ దుంపలను ముక్కలుగా చేసి ఎండ బెట్టి అమ్ముకోవచ్చు. వీటిని ఔషధాలు, సువాసన ద్రవ్వాలు, మొదలగు వాటిలో వాడతారు. ఆయుర్వేద మందుల దుఖాణాలలోకూడ దీనిని అమ్ము కోవచ్చు. గతంలో పల్లె ప్రజలు ఈ వజ కొమ్మును నీటితో నూరి చిన్న పిల్లలకు నాకించే వారు. దాంతో వారికి మాటలు తొందరగా వస్తాయని నమ్మే వారు. దీని నుండి పుట్టినదే ఈ జాతీయము "వస పిట్టలాగ వాగు తున్నావె" ఎక్కువగా మాట్లాడె పిల్లలను .."మీ అమ్మ నీకు వజ చాల ఎక్కువగా పోసినట్టుంది" అంటుంటారు.

నిమ్మ గడ్డి Cymbopogon

నిమ్మగడ్డి

ఇది గడ్డి జాతికి చెందిన మొక్క. వర్షాబావాన్ని తట్టుకోగలదు. ఇది వర్షా కాలంలోనె పెరుగు తుంది. నెలకి ఒక సారి తడి ఇచ్చినా తట్టుకోగలదు. ఇది నాటిన సుమారు మూడు నెలలకు పుష్పించే దశకు వస్తుంది. దీని వెన్ను ఒకదానిని తీసుకొని అరచేతిలో నలిపి వాసన చూస్తే ఘాటైన మంచి వాసన వస్తుంది. అదే ...... అది పక్వానికొచ్చినట్లు గుర్తు. అప్పుడు వెన్నులను కోసి వెంటనే బట్టిలలో వేసి దాని నుండి నూనెను తీస్తారు. దేశ వాళి బట్టీలలో నూనె దిగుబడి కొంత తక్కువగా వస్తుంది. ఇప్పుడు ఆధునికమైన బట్టీలు వచ్చాయి. దానిలో నేనె దిగుబడి ఎక్కువగా వుండడమే గాకుండా నూనె నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ నూనెనే ఔషధాలలో వాడతారు.

మెంతాల్ దీనిని పుదీనా అని కూడా అంటారు. సార వంతమైన అన్ని నేలలు దీని సాగుకు అనుకూలమె. తల్లి మొక్కల ముక్కలను, లేదా తల్లిపిలకకున్న చిన్న పిలకలతో ప్రవర్థనం చేయ వచ్చు. దీనిని అన్ని కాలలో నాటుకోవచ్చు. ఈ పంటకు ఎరవులు, పురుగు మందులు అవసరాన్ని బట్టి వేయాలు. అంతర కృషి చేయాలి. అవసరాన్ని బట్టి తడులివ్వాలి. నాటిన సుమారు మూడు ... నాలుగు నెలలకు మొదటి కోత వస్తుంది. ఆ తర్వాత సుమారు రెండు నెలలకు ఒక కోత వస్తుంది. దీని ఆకులను బట్టీ లలో వేసి నూనెను తీస్తారు. ఆ నూనెను అనేక మందుల తయారీలలో వాడుతారు.

సపేద్ ముసలి ప్రాంతీయంగా వీటిని తాడి గడ్డలు అని కూడా అంటారు. ఇది దుంప జాతి పైరు. మురుగు నీరు నిల్వని అన్ని రకాల ఇసుక, గరప ఎర్ర నేలలు ఈ పంటకు అనుకూలము. చిన్న దుంపలను విత్తనంగా వాడాలి. ఈ పంటకు అంతర కృషి, ఎరువులు, పురుగు మందులు అవసరము. నీటి ఎద్దడిని తట్టుకోగలదు గాని అవసరాన్ని బట్టి తడులివ్వాలి. నాటిన ఎనిమిది నెలలకు దుంపలు తయారవుతాయి. పెద్ద దుంపలను తోలు తీసి నీడలో ఆరబెట్టి అమ్ముకోవాలి. పిల్క దుంపలను విత్తనంగా వాడు కోవచ్చు.

కరివేపాకు

దూల గొండి

నేల వేము

రూష గడ్డి

సిట్రొ నెల్లా

కాసి గడ్డి

పన్నీరు మొక్క/ జిరేనియం

తులసి

నేల వేము