కంచరగుంట (దుర్గి)
కంచరగుంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, దుర్గి మండలంలోని గ్రామం. ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందినది. ఇది జిల్లా ప్రధాన కేంద్రం గుంటూరు నుండి పశ్చిమాన 118 కిమీ దూరంలో ఉంది. దుర్గి నుండి 9 కి.మీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 178 కి.మీ దూరంలో ఉంది.[1]
కంచరగుంట పిన్ కోడ్ 522612, పోస్టల్ ప్రధాన కార్యాలయం దుర్గి.
కోలగుట్ల (3 కి.మీ.), ఆత్మకూర్ (5 కి.మీ.), రాయవరం (8 కి.మీ.), దుర్గి (8 కి.మీ.), మందడి (9 కి.మీ.) కంచరగుంటకు సమీప గ్రామాలు. కంచరగుంట చుట్టూ పశ్చిమాన వెల్దుర్తి మండలం, ఉత్తరాన మాచర్ల మండలం, ఉత్తరాన రెంటచింతల మండలం, ఉత్తరాన గురజాల మండలం ఉన్నాయి.
మాచర్ల, వినుకొండ, మిర్యాలగూడ, నరసరావుపేట పట్టణాలు కంచరగుంటకు సమీపంలో ఉన్నాయి.
త్రాగునీటి సౌకర్యo
[మార్చు]గ్రామములోని త్రాగునీటి ఎద్దడి కారణంగా, గ్రామములో, గ్రామ సర్పంచ్ వేముల పెదసుబ్బారావు, మూడు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఒక త్రాగునీటి బోరును, 2015,జులై-15వ తేదీనాడు, ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, వేముల పెదసుబ్బారారు, సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలో ప్రధాన కూడలిలో ఉన్న, బొడ్రాయి వార్షికోత్సవం 2014,ఫిబ్రవరి-12న భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
మూలాలు
[మార్చు]- ↑ "Kancharagunta Village , Durgi Mandal , Guntur District". www.onefivenine.com. Retrieved 2025-10-29.