కంప్యూటర్ డిక్షనరీ (ఇంగ్లీషు - తెలుగు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Abacus : లెక్కలు చేయటానికి ఉపయోగించిన మొట్ట మొదటి సాధనం. తీగల (కడ్డీల) మీద పూసలను కదుపుట ద్వారా లెక్కలు చేస్తారు. దీనిని మొట్టమొదట చైనీయులు ఉపయోగించారు. ఇది చెక్కతో చేయబడి ఉంటుంది.

Access : హార్డ్ డిస్కు లాంటి Storage Devices నుండి కావలసిన డేటాను పొందుట; నెట్ వర్కింగ్ విధానంలో Networking Serverతో అనుసంధానించబడుట.

Accriditated Centre : అధికారంగా గుర్తింపు పొందిన శిక్షణా సంస్థ.

Access Time : ప్లాపీడిస్కుల నుండి, హార్డ్ డిస్కుల నుండి డేటాను పొందటానికి పట్టే సమయం, దీనిని మిల్లీ సెకండ్లలో కొలుస్తారు. Access Time ఎంత తక్కువగా ఉంటే ఆ పరికరం నుండి అంత త్వరగా డేటాను పొందగలము.

Acronym : రెండు లేదా అంతకంటె ఎక్కువ పదాల నుండి కొన్ని అక్షరాలను తీసుకొని ఉచ్ఛరించుటకు అనుకూలంగా ఉండేలా చిన్నపదం తయారు చేస్తారు. ఇలాంటి వాటిని Acronyms (ఎక్రోనిమ్స్) అంటారు. ఉదాహరణకు Dos అనే ఎక్రోనిమ్ Disk Operating System అనే మూడు పదములలోని తొలి అక్షరములను కలుపగా ఏర్పడినది.

Active Partition : హార్డ్ డిస్కును, రెండు లేక అంత కంటే ఎక్కువ భాగాలు చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టం ఉన్న భాగాన్ని Active Partition అంటారు. ఒక హార్డ్ డిస్కుకు ఒక Active Partition మాత్రమే ఉంటుంది.

Active Window : Windows లో పనిచేసేటప్పుడు ఒకేసారి నాలుగయిదు విండోలు ఓపెన్ చేసి ఉంచుకోవచ్చు. ఇలాంటప్పుడు ఏ విండో టైటిల్ బార్ (Title Bar) హైలెట్ చేయబడిందో (మిగిలిన వాటి కంటే నలుపు చేయబడిందో) దానిని Active Window అంటారు. మనం ఇచ్చే ఇన్‍పుట్ అంతా ఈ యాక్టీవ్ విండోలో చేరుతుంది.

ADA : ప్రపంచంలోని తొలి ప్రోగ్రామర్ ఆడా లవ్ లేస్ పేరు మీద రూపొందిన కంప్యూటర్ లాంగ్వేజీ.

ADC : (Analog to Digital Convertor) : ఎనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ గా మార్చే పరికరమును A-D Converter అంటారు. సాధారణ అవసరాలకు మనం వాడేవన్నీ డిజిటల్ కంప్యూటర్లు కనుక ఇవి డిజిటల్ సిగ్నల్స్ న్ మాత్రమే తీసుకుంటాయి. అందువలన కంప్యూటర్ కు ఎనలాగ్ సిగ్నల్స్ అందించాలంటే ముందు ఎన్ లాగ్ సిగ్నల్స్ ను డిజిటల్ సిగ్నల్స్ గా మార్చి మాత్రమే అందించాలి. ఎనలాగ్ సిగ్నల్స్ ను డిజిటల్ సిగ్నల్స్ గాను, డిజిటల్ సిగ్నల్స్ ను ఎనలాగ్ సిగ్నల్స్ గాను మార్చటానికి మోడెంను ఉపయోగిస్తారు.

Address : ఒక ఊరిలోని ప్రతి ఇంటిని సులువుగా గుర్తించుటకు ఎలాగయితే వేరువేరు ఇంటి నంబర్లు ఇస్తామో అలాగే కంప్యూటర్ మెమరీలో దాచాలనుకునే ప్రతి ఫైలుకు ఒక అడ్రస్ ఉంటుంది. కాబట్టి మెమరీలోని విషయాలను వెంటనే పొందగలుగుచున్నాము; అలాగే ప్రైమరీ మెమరీలోని ప్రతి "మెమరీసెల్"కు కూడా అడ్రస్ ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ