కంప్యూట్ గ్రీన్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
గ్రీన్ కంప్యూటింగ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఉద్యమం ప్రధాన ఉద్దేశం ఆధునిక ఎలక్ట్రానిక్ టెక్నాలజీ వల్ల పర్యావరణానికి జరిగే ముప్పుని, వినియోగదారునికి అధికంగా అయ్యే ఖర్చును తగ్గించే ప్రక్రియల సమాహారం ఇది.
ఉపోద్ఘాతం
[మార్చు]గ్రీన్ కంప్యూటింగ్ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వేగం పుంజుకుంటోంది. కంప్యూటింగ్ ఈరోజు సాధారణ పౌరుడికి కూడా కనీసావసరంగా మారిపోయింది. అయితే కంప్యూటర్ల ధరలు కానీ, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ల ధరలు కానీ సామాన్యపౌరులకు అందుబాటులో లేవు. ఇవ్వాళ్టికీ ఒక మధ్యస్థాయి కంప్యూటర్ కొనాలంటే కనీసం 25 వేల రూపాయల ఖర్చుపెట్టాల్సివస్తోంది. ఆపైన ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆఫీస్ సాఫ్ట్‌వేర్ల కోసం ఇంకో 20వేల రూపాయల ఖర్చుంటుంది. యాంటీవైరస్ కోసం ఏటా మరో అయిదారు వందల రూపాయల అదనపు ఖర్చు. అంటే ఒక కంప్యూటర్ కొనడానికి 45 వేల రూపాయల కనీస ఖర్చుంటోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ ధరల్లో కంప్యూటర్లను కొనగలగడం అసాధ్యం. ఈ సమస్యకు పరిష్కారం చూపించగలిగేది గ్రీన్ కంప్యూటింగ్ పద్ధతి.
వ్యర్ధాల నివారణ
[మార్చు]మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ వ్యర్ధాలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. అవసరం వున్నా, లేకున్నా ప్రతి మూడేళ్లకీ ఒకసారి కంప్యూటర్ సీపీయూను అప్‌డేట్ చేస్తుండడం వల్ల పాత కంప్యూటర్లన్నీ పనిచేసే స్థితిలో వున్నప్పటికీ ఈ-వేస్ట్‌గా మారిపోతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ఎలక్ట్రానిక్ కాలుష్యాన్ని చాలావరకూ తగ్గించవచ్చు. దీనికి కూడా గ్రీన్‌కంప్యూటింగ్ మాత్రమే పరిష్కారం.
భారత్‌లో గ్రీన్ కంప్యూటింగ్
[మార్చు]భారతదేశంలో ఇప్పుడిప్పుడే గ్రీన్ కంప్యూటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు, ఎన్‌జీవోలు పెరుగుతున్నాయి. కంప్యూటింగ్ అవసరాలను కస్టమైజ్ చేయడం ద్వారా ఆయా స్థాయిల ప్రజలకు కంప్యూటింగ్‌ను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఏజన్సీలు కృషిచేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంప్యూట్‌గ్రీన్ ఒక పూర్తిస్థాయి గ్రీన్ కంప్యూటింగ్ ఏజెన్సీగా రూపుదిద్దుకుంటోంది.
గ్రీన్ కంప్యూటింగ్ ప్రధాన లక్ష్యాలు
[మార్చు]కంప్యూట్‌గ్రీన్ కంపెనీ ప్రధాన లక్ష్యాలు
- ఖరీదైన ప్రొప్రయిటరీ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, సాఫ్ట్‌వేర్లకు ప్రత్యామ్నాయాలైన లైనక్స్ ఓఎస్‌లు, అప్లికేషన్లను జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లడం.
- ప్రభుత్వాలు, ప్రభుత్వాల అండతో నడిచే సంస్థల్లో లైనక్స్‌ను ప్రధానంగా ఉపయోగించేలా కృషి చేయడం
- ముందే లైనక్స్ ఇన్‌స్టాల్ చేసిన (Pre-Installed) ఫ్యాక్టరీ రీఫర్బిష్డ్ కంప్యూటర్లను తక్కువ ధరలకు సామాన్య పౌరులకు అందుబాటులోకి తీసుకురావడం
గ్రీన్ కంప్యూటింగ్ లక్ష్యంతో పనిచేస్తున్న అన్నితరహాల సంస్థలతో కలిసి పనిచేయడం, ఉమ్మడి లక్ష్యాలను సాధించడం కోసం కంప్యూట్‌గ్రీన్ చొరవ తీసుకుంటోంది. కంప్యూట్‌గ్రీన్ హైదరాబాదులో ప్రధానకేంద్రంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.