Jump to content

కచ్ ఏజెన్సీ

వికీపీడియా నుండి

 

కచ్ ఏజెన్సీ
ఏజెన్సీ
1819–1924
Location of కచ్ ఏజెన్సీ
Location of కచ్ ఏజెన్సీ
కచ్ ఏజెన్సీ మ్యాపు
చరిత్ర
 -  Established 1819
 -  వెస్టర్న్ ఇండియా స్టేట్స్ ఏజెన్సీ ఏర్పాటు 1924
విస్తీర్ణం
 -  1901 19,725 km2 (7,616 sq mi)
జనాభా
 -  1901 4,88,022 
Density 24.7 /km2  (64.1 /sq mi)

బ్రిటిషు భారతదేశం లోని ఏజెన్సీలలో కచ్ ఏజెన్సీ ఒకటి. రాజకీయ ఏజెంటుగా నియమితుడైన వ్యక్తి,19,725 చదరపు కిలోమీటర్లు (7,616 చ. మై.) విస్తీర్ణంలో ఉన్న కచ్ సంస్థానం ఒక్క దాన్నే చూసుకునేవాడు. ఇందులో రాన్ ఆఫ్ కచ్‌ భాగం కాదు.

ఏజెన్సీ ప్రధాన కార్యాలయం భుజ్‌లో ఉండేది.[1] ఏజెంట్ అక్కడే నివసించేవాడు. అతను బొంబాయి ప్రెసిడెన్సీలోని పొలిటికల్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం అధీనంలో ఉండేవాడు.[2]

చరిత్ర

[మార్చు]

1819లో కచ్ రాష్ట్రం బ్రిటిషు రక్షిత ప్రాంతంగా మారినప్పుడు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసారు.[3]

కెప్టెన్ జేమ్స్ మాక్‌ముర్డో మొదట ఏజెంటుగా, కచ్ కలెక్టర్‌గా, రెసిడెంటుగా నియమితుడయ్యాడు. కచ్ సంస్థానానికి రాజధానైన భుజ్‌కు దూరంగా, అంజర్‌లో అతని కార్యాలయం ఉండేది.[4]

కచ్ ప్రగతిశీల ప్రయాణం 1899-1900 కరువుతో ఆగిపోయింది.[3] కరువు సంస్థానమంతటా తీవ్ర ప్రభావం చూపింది. 1891 లో 5,58,415 గా ఉన్న కచ్ జనాభా, కరువు కారణంగా 1901 లో 4,88,022 కి తగ్గింది. [5]

1924 అక్టోబరు 10 న కచ్ ఏజెన్సీని రద్దు చేసి, వెస్టర్న్ ఇండియా స్టేట్స్ ఏజెన్సీలో విలీనం చేసారు.[6][1][7]

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The Indian Year Book, Volume 11 by Bennett, Coleman & Company, 1924,pp:151-152
  2. Sessional Papers - Volume 31, Great Britain. Parliament. House of Commons published by H.M. Stationery Office, 1900 - Page 464
  3. 3.0 3.1 Chisholm, Hugh, ed. (1911). "Cutch" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press.
  4. Gazetteer, Volume 5 By Bombay (India : State). 1880. p. 268. Retrieved 20 September 2014.
  5. The Imperial Gazetteer of India, British India Office.
  6. The India Office and Burma Office List by Harrison and sons, Limited, 1922- Page 393
  7. The Indian and Pakistan Year Book, Volume 23. 1936. p. 172.