కట్టకింద పల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కట్టకింద పల్లె, వైఎస్ఆర్ జిల్లా, కలసపాడు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేయుచున్న యస్.దాదాపీర్, 2013 వ సంవత్సరంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2013 సెప్టెంబరు 5 న ఢిల్లీలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నాడు.ఇతను 2003 జనవరి 1 నుండి ఇంతవరకూ పాఠశాలకు సెలవు పెట్టకుండా విధులు నిర్వహించుచున్నాడు. 2004 నుండి మహిళలకు రాత్రి బడి నిర్వహించుచున్నాడు. వారికి పలకలు, పుస్తకాలు, పెన్నులు ఉచితంగా అందింాడు. ఇతను "మన టీవీ" ద్వారా డైట్ విద్యార్థులకు పాఠాలు బోధించటానికి ఎంపికయ్యాడు. 2003 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2008 లో రాష్ట్ర ఉత్తమ పురస్కారం అందుకున్నాడు. విద్యా, సామాజిక రంగాలలో " దాదా పీర్ " చేస్తున్న కృషికి పలు పురస్కారాలూ, ప్రశంసా పత్రాలూ అందుకున్నాడు.[1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప 4-9-2013. 6వ పేజీ.