కడిమిచెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Kadamba
kadimi

కడిమిచెట్టును సంస్కృతంలో కదంబవృక్షం అంటారు. ఆప్టె నిఘంటువులో మెరుపులు వచ్డినపుడు మొగ్గలు వికసించే చెట్టు అని, పసుపు( termaric,) గడ్డి, ఆవాల మొక్క అని కూడా అర్థాలు ఇవ్వబడినవి. Neolamberckia, {Cadamba,(local) అంటారు. bur flower tree, laren, Leichhardt pine, సతత హరిత వృక్షాలని అంటారు. దీని శాస్త్రీయ నామం Neolamarckia Cadamaba of Rubi family. The Genus name is Jean Baptiste Lamarck. సంస్కృతంలో నీపము, కర్ణపూరము, కడంబము, కాదంబర్యము, జీర్ణపర్ణము,పుల్లకి, ప్రావృషేణ్యము, శ్రీమంతము, సీధుపుష్పము, సురభి, షట్సచేష్టము, హారిద్రము అనిదీనికి పెర్లున్నట్లు విక్షణరి చెబుతోంది. వెడల్పున లేత ఆకుపచ్చ, పసుపురంగు ఆకులు, చెట్టు చక్కగా పైకి పెరుగుతుంది. కొమ్మలు అన్నివైపులకు వ్యాపించి గొడుగులా ఆ తరుచ్ఛాయ క్రింద మనుషులు , జంతువులూ విశ్రాంతిగా ఉండడానికి అనువైనది. దాదాపు 150 అడుగుల ఎత్తు వరకు పైకి ఎదుగుతుంది. ఈ వృక్షానికి దివ్యశక్తులు ఉన్నట్లు భారతీయుల విశ్వాసం. దక్షిణ ఆసియా అంతటా ఈ వృక్షాలు కనిపిస్తాయి. భారతదేశంలో, నేపాల్, బాంగ్లాదేశ్, శ్రీలంక, తదితర ఆగ్నేయఆసియా దేశాల్లో ఈ చెట్లను వీధుల్లో రెండువైపులా అవెన్యూ వృక్షలుగా పెంచడం చూస్తాము.

ఆంధ్రదేశంలో కడిమిచెట్టు జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు మాసాంతం వరకు పూస్తాయి. పువ్వుల పరిమళం చాల దూరంవరకు వ్యాపిస్తుంది. పూవులు తేనెటీగలను బాగా ఆకర్షిస్తాయి. పూవు మొదట తెల్లగా, తర్వాత బంగారు బ్యాట్మింటన్ బంతి ఆకారంలో ఉండి, క్రమంగా పసుపుకు, ఎరుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్క నాటిన రెండు మూడేళ్ళలో పూతకు వస్తుంది. ఆకురాలుకాలంలో ఆకులన్నీ రాలి పడిపోతాయి. బాగా పండిన కడిమిచెట్టు పళ్లను సేకరించి మూడు నాలుగు రోజులు మాగేటట్లు చేసి, తర్వాత నీటిలో నానబెట్టి, పై గుజ్జునంతా నీటితో కడిగి వడగట్టి విత్తనాలను వేరుచేసి, ఎండబెడతారు. మట్టిలో నాటిన విత్తనాలు రెండు వారాల తర్వాత మొలకెత్తుతాయట.

కడిమిచెట్టు పువ్వులు, ఫలాలు, బెరడు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. పూలను అత్తరు పరిశ్రమలో వాడుతారు. ఈ చెట్టు మెత్తని కలప, కాగితంపరిశ్రమలో వినియోగిస్తారు, కేవలం ఇంటిముందు అందంగా కనిపించడానికి కూడా కడిమి చెట్చులను పెంచుతారు.

కడిమిచెట్టును ఆంట్లు, విత్తనాలు రెండువిధాలుగా ప్రవర్ధనం చేయవచ్చు. ఎండిన చిన్న చిన్న కాయలు పగిలి విత్తనాలు దూరదూరాలలో పడి అడవంతా మొలుస్తుంటాయి. విత్తనంలో పప్పులను తింటారని అంటారు.

భారతీయ పురాణాలలో, జానపదగాథల్లో, సాహిత్యంలో తరచు ఈ వృక్షం ప్రస్తావన కనిపిస్తుంది. కాళిదాసు మేఘసందేశంలో, లలితా సహస్రనామంలో, అమరకోశంలో, రాధాకృష్ణుల ప్రేమ గాథల్లో ఇంకా ఇతర పురాణగ్రంథాల్లో కదంబవృక్షాల ప్రస్తావన తరచుగా వస్తుంది. లలితాదేవిని "కదంబవన వాసినీ" అని సంబోధిస్తారు. మహాభారతం ఆదిపర్శ్వవంలో అరుణ సముద్ర కన్యక పేరు లోహితాయని. ఆమెను కుమారస్వామి తల్లి అనిచెబుతారు. ఆమెను కడిమిచెట్టులో పూజిస్తారు.విశ్వనాథ సత్యనారాయణ కడిమిచెట్టు పేరుతో రాసిన చారిత్రక నవలలో కడిమిచెట్టును ఒక మంచి కుటుంబానికి ప్రతీకగా గ్రహించారు.

(ఆకరాలు)మూలాలు: 1భారతీయ సాహిత్యం ,2 .అమరకోశం 3.లలితాసహస్రనామం,3. ఆయుర్వేద గ్రంథాలు 4.,పత్రికల్లో వ్యాసాలు.4.An article in Star of Mysor by Dr Mahadeswara Swami Scientist, published in the issue dated 25th August, 2019. 5.బ్రవుణ్య తెలుగు ఇంగ్లీష్ నిఘంటువులో కడిమిచెట్టు:The tree called Nauclea Cadamaba అని,కదంబము పదానికి A certain flowering plant callled nauclea Cadamaba, మొగులుకడిమి, కదంబకం, ఆవాలు అని అర్థాలు. the Hindu, dated 5ht,january,2023,Vijayawada Edition, page3, Project on Kadamaba fruit gets recognition for Vijayawad schoool girl.6. సంస్కృత మహాభారతం, వనపర్వం,కుమారస్వామి గాథ

ఫోటోలు: కాళిదాసు పురుషోత్తం.1. కదంబవృక్షం, 2. వృక్షానికి పూచిన పువ్వు. 3.టీ కప్పులో పుష్పం, పండినది సాసరులో