కథ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథ
దర్శకత్వంరాగా శ్రీనివాస్
నిర్మాతఊర్మిళ గుణ్ణం
తారాగణంజెనీలియా డిసౌజా, ప్రకాష్ రాజ్, అరుణ్‌ అదిత్‌
సంగీతంఎస్. కె. బాలచంద్రన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
డిసెంబరు 12, 2009 (2009-12-12)
భాషతెలుగు

కథ రాగా శ్రీనివాస్ దర్శకత్వంలో 2009లో విడుదలైన ఉత్కంఠభరిత చిత్రం. ఇందులో జెనీలియా, ఆదిత్ అరుణ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎస్. కె. బాలచంద్రన్ సంగీత దర్శకత్వం వహించాడు.[1]

స్పెషల్ జ్యూరీ అవార్డు , జెనీలియా, నంది పురస్కారం

చిత్ర ఒక ఒంటరి అమ్మాయి. అరకు వచ్చి అక్కడ ఒక బడిలో ఉపాధ్యాయురాలిగా చేరుతుంది. కృష్ణ అనే ఒక ఔత్సాహిక దర్శకుడు అరకులో తాను రాసుకున్న కథను సినిమాగా చిత్రీకరించడానికి వస్తాడు. అదే ఊర్లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ వీరేన్ తన భార్యా పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. చిత్ర అంతకు మునుపు తన కుటుంబం అంతా కళ్ళముందే హత్యకు గురవడంతో ఒక సంవత్సరం పాటు మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకుని బయటకు వస్తుంది. చిత్ర, కృష్ణ ఇద్దరూ స్నేహితులవుతారు. ఒకసారి చిత్ర బైనాక్యులర్స్ లో ఏదో చూస్తుండగా ఒక హత్య ఆమె కంటపడుతుంది. అందులో బాధితుల మొహం ఆమెకు బాగా కనిపిస్తుంది. ఆమె ఇదే విషయం పోలీసులకు తెలియబరుస్తుంది కానీ ఆమె చెప్పిన ప్రదేశంలో హత్య జరిగినట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవు. చిత్ర తన మానసిక వ్యాధి మళ్ళీ తిరగబెట్టిందేమోనని అనుమానపడుతుంది. కానీ కొద్దిరోజులకు పోలీసులకు ఒక సీడిలో చిత్ర చెప్పిన బాధితురాలు నిజంగానే ఉన్నట్లు తెలుస్తుంది. బాధితురాలు, సర్కిల్ ఇన్ స్పెక్టర్ వీరేన్ ఒక దుకాణంలో కలిసిఉన్నట్లు తెలుస్తుంది. బాధితురాలు నిజానికి చనిపోయిన వీరేన్ పాత స్నేహితురాలి కూతురు. కానీ వీరేన్ మాత్రం పరువు పోతుందని తన స్నేహితురాలితో అక్రమ సంబంధం గురించి బయటపెట్టడు. తన కూతుర్ని అరకు రప్పించి చంపాలని పథకం వేస్తాడు. చిత్ర ఆ సంఘటనను నిజంగానే చూసినా అది ఆమె మానసిక భ్రమ అని మభ్య పెట్టడానికి ప్రయత్నించాడు. వీరేన్ చిత్ర చూసిన సంఘటన భ్రమ అని చెప్పినా ఆమె వినకపోవడంతో చిత్ర మీద కోప్పడతాడు. చిత్ర, కృష్ణలు కలిసి సీడీ సంపాదించి పారిపోవాలనుకుంటారు. కానీ వీరేన్ కృష్ణను చంపాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో కృష్ణ వీరేన్ కాలికి గాయం చేస్తాడు. వీరేన్ కృష్ణకు తుపాకీ గురి పెట్టి ఆ సీడీ తనకు ఇచ్చేయమని చిత్రను బెదిరిస్తాడు. కానీ చిత్ర అందుకు అంగీకరించదు. వీరేన్ ను ఆమె లాగి చెంపదెబ్బ కొట్టడంతో అతను కృష్ణను వదిలేసి ఆత్మహత్య చేసుకుంటాడు. చిత్రకు అంత ధైర్యం ఎలా వచ్చింది అని కృష్ణ అడగ్గా వీరేన్ అంతకు ముందే ఒక చనిపోయిన అధికారిని హత్య కేసులో ఇరికించాడనీ తమను చంపలేడని చెబుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ సాక్ష్యాన్ని పోలీసులకు అందజేస్తారు. ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎస్. కె. బాలచంద్రన్ సంగీత దర్శకత్వం వహించాడు.

  • భయంగా భయంగా అయోమయంగా

మూలాలు

[మార్చు]
  1. "Katha film review - Telugu cinema Review - Genelia & Arun". www.idlebrain.com. Retrieved 2020-07-18.