కనకాంబరాలు

వికీపీడియా నుండి
(కనకాంబరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కనకాంబరాలు పూలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. infundibuliformis
Binomial name
Crossandra infundibuliformis
Synonyms

Justicia infundibuliformis L.
Crossandra undulifolia Salisb.

కనకాంబరాలు ఒక రకమైన పూల మొక్క. కనకాంబర పూలు శ్రీలంక దక్షిణ భారతదేశానికి చెందినది. ఇది ఇరుకైన, దీర్ఘచతురస్రాకార ఆకులు పగడపు పువ్వులను కలిగి ఉంటుంది.

చరిత్ర[మార్చు]

ఉష్ణమండల, మోతాదు ఉష్ణ మండలములలో పెరుగుతుంది. కనకాంబరం పూల మొక్క ఇంటి లోపల పెంచవచ్చు. వసంత ఋతువులో పెంచ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి. కనకాంబరం మొక్క 1 నుండి 3 అడుగుల పొడవు, 1 నుండి 2 అడుగుల వెడల్పు లో ఉంటుంది . కనకాంబరం పువ్వులు నారింజ , నేరేడు, ఎరుపు , పసుపు రంగులలో మనము చూడ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి పూలు వచ్చే సమయం ఏప్రిల్ మే నుంచి అక్టోబర్ వరకు[1] పెరుగుదలకు 30 - 35 ° C ఉష్ణోగ్రత అవసరం. కొంతవరకు నీడను తట్టుకోగలదు.[2] ఒక విధముగా చెప్పాలంటే గృహములో పెంచే మొక్క అని మనము చెప్పవచును. వివాహములకు, మహిళలు కేశాలంకరణ కొరకు , కనకాంబరం పువ్వులు దక్షిణ భారత దేశములో వీటి వాడకం మనము చూస్తుంటాము [3]

వైద్య రంగములో వాడకం[మార్చు]

కనకాంబరం మొక్కలను హెర్బల్ వైద్య విధానం లో దగ్గు, అల్సర్ వంటి చికిత్సలకు వాడతారు [4] పైన చెప్పినవే కాక కనకాంబరాల పూల మొక్క లతో ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తూన్నారాని మనకు పరిశోధనల ద్వారా తెలుస్తున్నది [5] పూనా(మహారాష్ట్ర) ఉన్న మోడరన్ కాలేజీ , బయోటెక్నాలజీ వారు తమ ప్రచురణ జర్నలో కనకాంబరం మొక్కలు , పూలు సెల్ ఫోన్ ల పై వచ్చే బాక్టీరియా ను కూడా నిర్మూలించ వచ్చని తెలుపుతున్నారు [6]

కనకాంబర పూలు

మూలాలు[మార్చు]

  1. "How to Grow and Care for Crossandra (Firecracker Flower)". The Spruce (in ఇంగ్లీష్). Retrieved 2020-08-11.
  2. "Horticulture :: Flower Crops :: Crossandra". agritech.tnau.ac.in. Retrieved 2020-08-11.
  3. "Crossandra infundibuliformis - Crossandra". www.flowersofindia.net. Retrieved 2020-08-11.
  4. "Crossandra Infundibuliformis Herb Uses, Benefits, Cures, Side Effects, Nutrients". Herbpathy. Retrieved 2020-08-11.
  5. Sangekar SN; Devarkar VD (2020-08-11). "Pharmacognostical studies in Crossandra infundibuliformis (L.) Nees" (PDF). JSBD. Archived (PDF) from the original on 2022-06-16. Retrieved 2020-08-11.
  6. "Antibacterial activity of Crossandra infundibuliformis and Jasminum sambac against cell phone bacteria" (PDF). www.scholarsresearchlibrary.com. Archived from the original on 2022-06-29. Retrieved 2020-08-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)