Jump to content

కన్నూర్ స్క్వాడ్

వికీపీడియా నుండి
కన్నూర్ స్క్వాడ్
దర్శకత్వంరాబి వర్గీస్‌ రాజ్‌
స్క్రీన్ ప్లే
  • మొహమ్మెద్ షఫీ
  • రోనీ డేవిడ్ రాజ్
కథమొహమ్మెద్ షఫీ
నిర్మాతమమ్మూట్టి
తారాగణం
  • మమ్మూట్టి
  • రోనీ డేవిడ్ రాజ్
  • శబరీష్ వర్మ
  • రోనీ డేవిడ్ రాజ్
  • విజయరాఘవన్
  • కిషోర్
ఛాయాగ్రహణంమొహమ్మెద్ రాహుల్
కూర్పుప్రవీణ్ ప్రభాకర్
సంగీతంసుషీన్ శ్యామ్
నిర్మాణ
సంస్థ
మమ్మూట్టి కంపెనీ
విడుదల తేదీ
28 సెప్టెంబరు 2023 (2023-09-28)
సినిమా నిడివి
161 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కన్నూర్ స్క్వాడ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు రాబి వర్గీస్‌ రాజ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్, శబరీష్ వర్మ, కిశోర్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 07న విడుద‌ల చేయగా[2] సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]
  • మమ్ముట్టి
  • రోనీ డేవిడ్ రాజ్
  • అజీస్
  • శబరీష్ వర్మ
  • కిశోర్
  • విజయరాఘవన్
  • రోనీ డేవిడ్ రాజ్
  • అజీజ్ నెడుమంగడ్
  • శరత్ సభ
  • సన్నీ వేన్

కేరళలోని కన్నూర్ జిల్లాలో నేరాలకు అరికట్టడానికి నలుగురు సభ్యులతో ఏఎస్సై జార్జ్ మార్టిన్ (మమ్ముట్టి) నేతృత్వంలో కానిస్టేబుళ్లు జయకుమార్ (రోనీ), షఫీ (శబరీష్), డ్రైవర్ జోస్ (అజీస్) తో ఓ బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేస్తారు. ఒకరు ఇసుక మాఫియా నుంచి లంచం తీసుకోవడం, ఆ వీడియో లీక్ కావడంతో ఆ బృందాన్ని పక్కన పెట్టేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తారు. కాసర్‌ గోడ్ ప్రాంతంలో జరిగిన రాజకీయ నాయకుడి హత్య కేసును ఇన్వెస్టిగేట్ బాధ్యత 'కన్నూర్ స్క్వాడ్' చేతిలో పెడతారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పది రోజుల్లో పట్టుకోవాలని చెబుతారు. అసలు, ఆ హత్య ఎవరు చేశారు? వాళ్ళను జార్జ్ అండ్ టీమ్ పట్టుకున్నారా? లేదా? దర్యాప్తులో వాళ్ళకు ఎదురైనా సవాళ్ళు ఏమిటి? అనేదే మిగతా సినిమా కథ.[3]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మమ్ముట్టి కంపెనీ
  • నిర్మాత: మమ్ముట్టి కంపెనీ
  • కథ: మొహమ్మెద్ షఫీ
  • స్క్రీన్‌ప్లే: రోనీ డేవిడ్ రాజ్ & మొహమ్మెద్ షఫీ
  • దర్శకత్వం: రాబి వర్గీస్‌ రాజ్‌
  • సంగీతం: సుషీన్ శ్యామ్
  • సినిమాటోగ్రఫీ: రహీల్

మూలాలు

[మార్చు]
  1. "Kannur Squad". British Board of Film Classification (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2023. Retrieved 28 September 2023.
  2. Namasthe Telangana (8 September 2023). "సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో మమ్ముట్టి 'కన్నూర్ స్క్వాడ్' ట్రైల‌ర్". Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.
  3. The Hindu (28 September 2023). "'Kannur Squad' movie review: Mammootty stars in an effective procedural drama, that works despite its generic elements" (in Indian English). Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.

బయటి లింకులు

[మార్చు]