Jump to content

కన్నూషి

వికీపీడియా నుండి
జో(jōe) ధరించిన కన్నూషి, వెనుక ఇద్దరు మికోలు అనుస రిస్తున్నారు.
నిండుగా వస్త్రాలు ధరించిన కన్నూషి, కటోరి పుణ్యక్షేత్రం
ఒక కరిగిను (kariginu), ఒక ఎబోషి (eboshi) టోపీ ధరించిన ఒక కన్నూషి

కన్నూషి (神主, "డివైన్ మాస్టర్ (ఆఫ్ సెరేమోనీస్ )", వాస్తవానికి కమునుషి అని ఉచ్ఛరిస్తారు), అలాగే షిన్‌షోకు (神職, అంటే "దేవుని ఉద్యోగి") అని కూడా పిలుస్తారు. ఇతను షింటో మందిర (神社, జింజా) నిర్వహణా బాధ్యత తో పాటుగా, ఆ మందిరపు కామికి ప్రధాన పూజా కార్యక్రమాలను కూడా తానే నిర్వహిస్తాడు.[1] ఈ కన్నుషిలను కొన్నిసార్లు అదే అర్థం వచ్చే జిన్షు అనే పేరుతో కూడా వ్యవహరిస్తారు.

వాస్తవానికి, కన్నూషీలు ఇద్దరికీ మధ్యవర్తులుగా ఉంటూ కామి ఇష్టాన్ని, సాధారణ ప్రజానీకానికి చెరవేస్తారు. కన్నూషి అద్భుతాలు చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి , లేదా పవిత్రమైన వ్యక్తిగా శుద్ధి చేసే ఆచారాల తో కామి కి మాధ్యమంగా మారగల వ్యక్తి. కాలక్రమంలో కన్నూషీ పదం, ఒక పుణ్యక్షేత్రంలో పనిచేసే వ్యక్తి, అక్కడ మతపరమైన వేడుకలు నిర్వహించే వ్యక్తి అనే అర్థానిచ్చే షిన్‌షోకు అనే పదానికి పర్యాయపదంగా మారింది. [1] [2]

పురాతన కాలంలో, ఒక వంశంలో రాజకీయ, మతపరమైన శక్తి అతివ్యాప్తి చెందడం వల్ల, మతపరమైన కార్యక్రమాల సమయంలో వంశస్థులను వంశాధిపతే నడిపించేవాడు.లేదా, అది మరొక వంశ అధికారి నిర్వహించేవాడు.[2] కాలక్రమాన, ఈ పాత్ర వేరుగా, మరింత ప్రత్యేకమైన రూపంలోకి పరిణామం చెందింది. ఈ పదం కోజికి (సా.శ. 680), నిహోన్ షోకి (సా.శ. 720)[2] రెండింటిలోనూ కనిపిస్తుంది, ఇక్కడ ఎంప్రెస్ జింగూ, సుజిన్ చక్రవర్తి వరుసగా కన్నుషిగా మారారు.

ఇసే జింగో లేదా అమివా పుణ్యక్షేత్రం వంటి ఒకే మందిరంలో, ఒకే సమయంలో వివిధ రకాల కన్నూషీలు ఉండే అవకాశం ఉంది; వారిని ఓ-కన్నూషీ(Ō-kannushi), సో-కన్నూషీ(Sō-kannushi), లేదా గొన్-కన్నూషీ (Gon-kannushi) [2]అని పిలుస్తారు.

కన్నూషి వివాహం చేసుకోవచ్చు, అలాగే సాధారణంగా అతని సంతానమే అతని తదనంతరం బాధ్యతలను స్వీకరిస్తారు.[3] ఈ వంశ పారంపర్య హోదా చట్టబద్దం కానప్పటికీ, ఆచరణలో మాత్రం కొనసాగుతోంది.[4]

కన్నూషి ధరించే జో(jōe),ఎబోషి(eboshi),కరిజింగు(kariginu), దుస్తులు ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగినవి కాదు, అయితే ఇవి గతంలో ఇంపీరియల్ కోర్టు వినియోగంలో ఉన్న అధికారిక వస్త్రాలు. [3] కామి ఆరాధనకు, చక్రవర్తి బొమ్మకు మధ్య సన్నిహిత సంబంధాన్ని సూచిస్తాయి.[3] కన్నూషి ఉపయోగించే ఇతర పనిముట్లలో షకు అనే లాఠీ, తెల్ల కాగితపు పతాకాలు అలంకరించిన ఓనుసా(ōnusa)అనే మంత్రదండం(shide ) ఉంటాయి. కన్నూషి కి వారి మతపరమైన లేదా మతాధికారుల పనిలో కొందరు స్త్రీలు సహాయకులుగా ఉంటారు. వారిని మికో లని అంటారు.

కన్నూషి కావడానికి, పూర్వానుభవం లేని కొత్త వ్యక్తి షింటో పుణ్యక్షేత్రాల సంఘం ఆమోదించిన విశ్వవిద్యాలయంలో తప్పనిసరిగా చదువుకొని ఉండాలి, సాధారణంగా టోక్యోలోని కొకుగాకుయిన్ విశ్వవిద్యాలయం లేదా ఇసే యొక్క కొగక్కన్ విశ్వవిద్యాలయం, లేదా అతని అర్హతను ధృవీకరించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. [4] స్త్రీలు కూడా కన్నూషి గా మారవచ్చు, వితంతువులు తమ భర్తలు నిర్వహించిన బాధ్యతలను స్వీకరించ వచ్చు.[4]

ఇది కూడ చూడు

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 Nishimuta, Takao (2007-03-28). "Kannushi". Encyclopedia of Shinto. Kokugakuin. Archived from the original on 2011-05-20. Retrieved 2009-10-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "eos" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 2.2 2.3 Moriyasu, Jin. "Kannushi". Nihon Hyakka Zensho (in జపనీస్). Shogakukan. Archived from the original on 2012-09-14. Retrieved 2009-10-16.
  3. 3.0 3.1 3.2 Nishimura, Hajime (1998). A Comparative History of Ideas. Motilal Banarsidass. ISBN 978-81-208-1004-4.
  4. 4.0 4.1 4.2 "Shinshoku". Encyclopædia Britannica Online. Retrieved 2009-10-16.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కన్నూషి&oldid=3444668" నుండి వెలికితీశారు