కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం
కృతికర్త: మొదలి నాగభూషణ శర్మ
డా.ఏటుకూరి ప్రసాద్
అంకితం: సెట్టి ఈశ్వర రావు
అవసరాల సుర్యా రావు
కె.వి.రమణా రెడ్డి
బండి గోపాల రెడ్డి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కన్యాశుల్కం నాటకం రెండవ కూర్పు తొలి ప్రచురణకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రచురించిన పుస్తకం
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాదు
విడుదల: 1999
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు

కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం కన్యాశుల్కం నాటకం రెండవ కూర్పు తొలి ప్రచురణకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రచురించిన పుస్తకం.[1][2] ఇది నూరు సంవత్సరాలకి పైబడి నిరంతరంగా సాగిన విమర్శలని ఒకచోట చేర్చగా రూపొందిన పుస్తకం. గురజాడ జన్మదినమైన 1999 సెప్టెంబరు 21న వెలువరించి..జనం నాల్కల మీద గురజాడ సాహిత్యం నిలిచేలా కృషి చేసిన సెట్టి ఈశ్వర రావు, అవసరాల సుర్యా రావు, కె.వి.రమణా రెడ్డి , బం.గో.రె(బండి గోపాల రెడ్డి) కి అంకితం చేసారు.

"కన్యాశుల్కం గురజాడ రచనేనా?" నుంచి మొదలు అయి "కన్యాశుల్కం" పుట్టు పుర్వోత్తరాలు.. అసలు నాటక కర్త గా గురజాడ, కన్యాశుల్కం భాష.. కన్యాశుల్కం లో పాత్రల మీద మహామహుల వాడి వేడి గా విమర్శనాస్త్రాలతో రూపొందినది. ఈ పుస్తకానికి సంపాదకులుగా ఆచార్య మొదలి నాగభూషణ శర్మ[3] , డా.ఏటుకూరి ప్రసాద్[4] గార్లు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "The great man of theatre!". The Hans India (in ఆంగ్లం). 2019-01-20. Retrieved 2019-02-03.
  2. "ఉపయుక్త గ్రంథాలు-శోధనగంగ ఇన్‌ఫిబ్‌నెట్" (PDF).
  3. "నాటక శిల్పం-పరిచయం".
  4. "shodhganga.inflibnet.ac.in - Bibilography" (PDF).