Jump to content

గిలక (పుల్లీ)

వికీపీడియా నుండి
(కప్పీ నుండి దారిమార్పు చెందింది)
ఒక స్థిరమైన కప్పి (గోధుమ రంగు) యొక్క రేఖాచిత్రం, బరువు (ముదురు బూడిద రంగు) ను పైకి లాగేందుకు గాని కిందకి వదలేందుకు గాని ఉపయోగించే తాడు (లేత బూడిద రంగు)
కదిలే కప్పి

గిలక (ఆంగ్లం: Pulley) అనగా ఒక సరళ యంత్రం, దీనిని భారీ వస్తువులను ఎత్తేందుకు ఉపయోగిస్తారు. ఇది సాధారణ యంత్రం యొక్క ఒక రకం. దీనిని ఆంగ్లంలో పుల్లీ అంటారు. కొన్నిసార్లు బ్లాక్ అండ్ టాక్లీ అంటారు. దీనిని తెలుగులో కప్పీ అని కూడా అంటారు. తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ బరువులను ఎత్తగలిగేలా వీటిని రూపొందిస్తారు.

పుల్లీ రకాలు

[మార్చు]

స్టాటిక్ A - స్టాటిక్ లేదా తరగతి 1 కప్పి ఒక ఇరుసు ను కలిగి ఉంటుంది, ఇది స్థిరమైనది లేదా నిశ్చలమైనది, అనగా దీనిని తరలించలేము. తాడు లోని బలం మళ్ళింపు ద్వారా స్థిర కప్పిని ఉపయోగిస్తారు. ఒక స్థిర కప్పి 1 యొక్క ఒక యాంత్రిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. స్టాటిక్ కప్పి ఒక చక్రం, ఒక ఇరుసును కలిగి ఉంటుంది.

మూవబుల్ A - కదిలే లేదా తరగతి 2 కప్పి ఒక ఇరుసును కలిగి ఉంటుంది, ఇది సస్థలంలో ప్రీ గా కదులుతుంది. బలాన్ని మార్చుట ద్వారా కదిలే కప్పిని ఉపయోగిస్తారు. కదిలే కప్పి 2 యొక్క యాంత్రిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. దీనికి తాడు యొక్క ఒక చివరన లంగరేసి ఉంటుంది, తాడు యొక్క మరొక చివర లాగినపుడు కప్పితో జోడించబడిన వస్తువు రెట్టింపు బలంతో లాగబడుతుంది.

కాంపౌండ్ A - మిశ్రమ కప్పి, స్థిర, కదిలే కప్పి వ్యవస్థల కలయికగా ఉంటుంది.

బ్లాక్ అండ్ టాక్లీ - బ్లాక్ అండ్ టాక్లీ అనగా మిశ్రమ కప్పి, దీనికి అనేక కప్పిలు ప్రతి ఇరుసుకు అమర్చబడి ఉంటాయి. మరింత యాంత్రిక ప్రయోజనం పెరుగుతుంది.