యంత్రం
ఒక పనిని చేయడానికి శక్తిని ఉపయోగించే పరికరాలను యంత్రము (ఆంగ్లం: Machine) అంటారు. ఏ రకమైన సాధనంలోనైనా ఇలాంటి పరికరాలుంటే వానిని యంత్రాలు అనవచ్చును. వీనిలో సరళ యంత్రాలు ఇలాంటి శక్తియొక్క దిక్కును మార్చుతాయి గాని శక్తిని ఉపయోగించవు.
భాషా విశేషాలు[మార్చు]
తెలుగు భాషలో యంత్రము అనే పదానికి వికృతి పదం జంత్రము. "Machine" అనే పదం లాటిన్ machina నుండి ఉద్భవించినది.[1]
యంత్రము [ yantramu ] yantramu. [[[సంస్కృతం]] n. A contrivance, machine, implement, instrument, apparatus. A diagram or figure of a mystical nature, an astrological character: a talisman, or amulet. A pump. సాధనము, యుక్తియుక్తమైన కరణము. "జిలుగు కెంపుల యంత్రముల మేతలంటక చాలసోలుచు తూలు శారికలను." Ila. iv. 58. ఇక్షుయంత్రము a sugarcane mill. A. ii. 94. "కలయంత్రధారల కప్పి కప్పి." Zaccaya. v. 47. యంత్రకారుడు yantra-kāruḍu. n. A maker of engines, an engineer, an artillery man, a gunner. యుక్తియుక్తమైన సాధనకారుడు. "కందళితాహర్ముఖ యంత్రకారుడు." A. v. 89. టీ యంత్రకారుడు, పిరంగులు కాల్చేవాడు. యంత్రధారకుడు yantra-dhārakuḍu. n. An engineer, one who manages an engine. యంత్రమును తిప్పేవాడు. L. xv. 126. యంత్రపాతితము yantra-pātitamu. n. A kind of cake. జంతికలు. యంత్రించు yantrinṭsu. v. a. To contrive: to plan: to make a diagram or figure of a mystical nature, to put under a spell, యంత్రమువేయు. "యంత్రించి మంత్రించి యంత్రించుడంచు." Pal. 98. యంత్రితము yantritamu. adj. Spell bound, కట్టబడిన.
యంత్రాలలో రకాలు[మార్చు]
- సరళ యంత్రాలు (Simple Machines): చక్రం, మర, కప్పీ మొదలైనవి
- ముద్రణా యంత్రాలు (Printing Machines):
- కాల యంత్రాలు (Time Machines): గడియారాలు
- ఉష్ణ యంత్రాలు (Heat Engines):
- ఆవిరి యంత్రాలు (Steam Engines): రైలు, ఓడ మొదలైనవి.
- రవాణా యంత్రాలు: బస్సు, కారు, ఓడ, రైలు, విమానం మొదలైనవి.
- ఎలక్ట్రానిక్ యంత్రాలు (Electronic Machines): ట్రాన్సిస్టర్, డయోడ్
- కంప్యూటరు (Computer), మర మనిషి (Robot)
- టర్బైన్లు (Turbines): గాలి మర
- పంపులు (Pumps): సైకిల్ పంపు
- గానుగ (Mill): నూనె, చెఱకు, రాయి మొదలైనవి.
మూలాలు[మార్చు]
- ↑ The American Heritage Dictionary, Second College Edition. Houghton Mifflin Co., 1985.