సైకిల్ పంపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Cycle-pump.jpg
సైకిల్ పంపు
కాలితో త్రొక్కడం ద్వారా పని చేసే సైకిల్ పంపు.

సామాన్య మానవుని సౌకర్యవంతమైన వాహనం సైకిల్. సైకిల్ ఉన్న ప్రతివారూ తప్పక ఉపయోగించు సాధనం గాలి కొట్టే పంపు. సైకిల్ పంపు, సైకిల్ చక్రాల ట్యూబులలో గాలిని నింపడానికి పనికివచ్చే ఒక విధమైన positive-displacement పంపు.


సైకిల్ ట్యూబులలో రెండు విధాలైన కవాటాలు లేదా "వాల్వులు" (valves) వాడుతారు - అవి (1) ష్రేడర్ వాల్వు (2) ప్రెస్టా వాల్వు. సైకిల్ పంపులోంచి వెలువడే గాలిని ట్యూబులో ఎక్కించడానికి వీలుగా గొట్టం చివర నట్టు "అడాప్టర్ " లేదా "అనుసంధాన పరికరం" (connection or adapter)లా పని చేస్తుంది. ఈ అడాప్టర్ ష్రేడర్ వాల్వు, ప్రెస్టా వాల్వు అనే రెండు విధాల కవాటాలకు సరిపోతుంది. ఇవే కాకుండా Woods valve అనే మరొక వాల్వు కూడా వాడకంలో ఉంది. Woods valve వాడే ట్యూబులో గాలి నింపడానికి Presta pump ఉపయోగపడుతుంది.[1]


అత్యంత సాధారణంగా వాడే సైకిల్ పంపు చేతితో కదుపబడే పిస్టన్ ద్వారా పని చేస్తుంది. హాండిల్ పట్టుకొని పిస్టన్‌ను పైకి లాగినపుడు "ఏకపక్ష కవాటం" (one-way valve) ద్వారా బయటి గాలి పంపు గొట్టం లోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ పిస్టన్‌ను క్రిందికి నొక్కినపుడు ఏకపక్ష కవాటం గొట్టంలోని గాలిని బయటకు పోనియ్యదు. ట్యూబ్‌కు అమర్చిన వాల్వు ద్వారా సైకిల్ చక్రం ట్యూబులోకి ప్రవేశిస్తుంది. కాలితో నొక్కే పంపులలో (floor pumps లేదా track pumps) టైరు లోపల గాలి వత్తిడిని చూపే ఒక కొలమానం (pressure gauge) ఉంటుంది.


చేతి లేదా కాలి పంపులే కాకుండా పెట్రోల్ స్టేషనులలో కారుల ట్యూబులకు గాలి కొట్టడానికి వాడే కంప్రెసర్ పంపుల ద్వారా కూడా సైకిల్ ట్యూబులోకి గాలి ఎక్కిస్తుంటారు. కాని ఇలా చేసే టపుడు టైరు బరస్ట్ అవ్వకుండఅ జాగ్రత్త పడాలి.

బైసికిల్ పంపు రకాలు

[మార్చు]
Frame mounted bike pump

మూడు ముఖ్యమైన రకాలైన సైకిల్ పంపులు వాడబడుతున్నాయి.

  • స్టాండు పంపు
  • చేతి పంపు
  • కాలి పంపు

స్టాండు పంపు

[మార్చు]

దీనిని ఫ్లోర్ లేక ట్రాక్ పంపు అని కూడ అంటారు.దీనిని ఉపయొగించువారు పంపు యొక్క క్రింది భాగమును నేలపై ఉంచి,దానిపై ఒక పాదమును ఉంచి పంపు పైభగమును(handles)చేతితో నొక్కి( push),లాగుతారు(pull).ఒక అదనపు గొట్టం శూన్యం ను తయారు చేయుటకు పంపు కు అమర్చబడి ఉంటుంది.

చేతి పంపు

[మార్చు]

చేతితో కొట్టే సైకిల్ పంపులలో రెండు ముఖ్యమైన రకాలున్నాయి - ట్యూబు పంపు (tubed pump), ఏకీకృత పంపు (integral pump). ట్యూబు పంపులు చౌకగా లభిస్తాయి కాని వాటి "efficiency" తక్కువ. పంపు గొట్టాన్ని సైకిలు ట్యూబు వాల్వుతో కలపడానికి మరొక సన్నని (సహజంగా గట్టి రబ్బరుతో చేసిన) ట్యూబు కావలసి వస్తుంది. ట్యూబు పంపులో చాలా జాయింట్లు ఉండడం వల్ల గాలి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏకీకృత పంపులలో గొట్టం ప్రక్కనే ఒక చిన్న రంధ్రం, ఒక వాషర్ ఉంటాయి. ఒక చిన్న లివర్ ద్వారా దీనిని సైకిల్ ట్యూబు వాల్వుకు తగిలిస్తారు. ఇది బాగా సీల్ చేయబడినందువలన, ఇందులో dead volume తక్కువ గనుక, ఇవి మరింత efficient గా పనిచేస్తాయి. 18" ట్యూబు పంపుకంటే 8" ఏకీకృత పంపు ఎక్కువ గాలిని సరఫరా చేస్తుంది.


సింపుల్‌గా ఉన్న పంపులో ఒక కప్పు ఆకారంలో ఉన్న ఫైబర్ పిస్టన్ లేదా ప్లాస్టిక్ పిస్టన్ ఉంటుంది. పిస్టన్‌ను పైకి లాగినపుడు గొట్టం పైభాగం రంధ్రంలోంచి పిస్టన్ క్రింది భాగానికి గాలి చేరుతుంది. పిస్టన్‌ను క్రిందికి తోసినపుడు ఈ గాలి పైభాగానికి పోనియ్యకుండా ఆ కప్పు షేపు సిలిండర్ అడ్డుపడుతుంది. అంటే ఇక్కడ పిస్టన్‌లోనే కవాటం కూడా కలిసి ఉందన్నమాట. అందువలన గాలి పైకి పోయే అవకాశం లేకుండా క్రిందికి నెట్టబడుతుంది. గొట్టం క్రింది భాగంనుండి ఒక గట్టి రబ్బర్ ట్యూబు ద్వారా గాలి సైకిల్ ట్యూబులోకి ప్రవేశిస్తుంది. సైకిల్ ట్యూబు ద్వారంలో ఉన్న వాల్వు గాలిని ట్యూబులోపలికి పోనిస్తుంది కాని బయటకు పోనివ్వదు. ఇందులో గొట్టం లోపలి పిస్టన్ రెండు ప్రక్కలా మూసివేసి ఉంటుంది. కనుక పిస్టన్‌ ముందుకు లాగినప్పుడూ, బయటకు లాగినప్పుడూ (లేదా పైకి, క్రిందికి లాగినప్పుడు) కూడా ఇందులోంచి సైకిల్ ట్యూబు లోపలికి గాలి వెళుతుంది.


పంపులను సైకిల్ తొక్కేవారు తమతో పాటు ఒక సంచిలో తీసుకొని వెళ్ళవచ్చును. లేదా సైకిల్ ఫ్రేముకు ఒక క్లాంపు ద్వారా బిగించవచ్చును.

కాలి పంపులు

[మార్చు]

ఈ పంపులు సైకిలు కొరకు ప్రత్యేకంగా తయారు చేసినవి కావు.ఇవి ఎక్కువ ఒత్తిడి ని సృష్టించలేవు కావున సన్నని త్రోవ వాహనాల టైర్లకు పనికిరావు.కాని పెద్ద పెద్ద తక్కువ-ఒత్తిడి టైర్లు అంటే కొండలు ఎక్కడానికి ఉపయొగించే వాహనాలకు(mountain bikes) ఉపయోగపడతాయి

అవి కార్ల కోసం తయారు చేయబడడం వల్ల schrader valves ను కలిగి ఉంటాయి.సైకిలు presta valves ను కలిగి ఉంటే ,పంపు ను ఉపయోగించడానికి చిన్న ఇత్తడి reducer ను కలిగి ఉంటుంది.

CO2 పంపులు

[మార్చు]

ఈ పంపులు ఎక్కువగా కొండ ప్రాంతాలలో లేదా సైకిల్ పందాలలో ఉపయోగిస్తారు. వీరి ముఖ్య ఉద్దేశం బరువు తగ్గించడం, పంక్చర్ అయితే వెంటనే రెడీగా దొరికే CO2 కాన్లతో నింపుకోవచ్చును. ఇవి కొంచెం ఖరీదైనవిగా ఉంటాయి. కానీ CO2 రబ్బరులో కొద్దిగా కరిగే లక్షణం ఉండడం వలన కొద్ది రోజులలోనే మల్లీ పంక్చర్ అవుతుంది. ఇది గాలి కంటే తొందరగా బయటకు పోతుంది.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]