కమలేశ్ డి.పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమలేశ్ డి.పటేల్ (దాజి)
జననం
కమలేశ్ దేసాయిభాయి పటేల్

(1956-09-28) 1956 సెప్టెంబరు 28 (వయసు 67)
శ్రీరామచంద్ర మిషన్‌‌‌‌ ,
హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్,
హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్
గుర్తించదగిన సేవలు
ది హార్ట్ ఫుల్ నెస్ వే (2018), డిజైనింగ్ డెస్టినీ (2019)
బిరుదుశ్రీరామచంద్ర మిషన్‌‌‌‌ అధ్యక్షుడు,
గ్లోబల్ గైడ్ అఫ్ హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్,
హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు,
సహజ్ మార్గ్ స్పిరిచ్యువాలిటీ ఫౌండేషన్ - మేనేజింగ్ ట్రస్టీ
అంతకు ముందు వారుశ్రీ పార్థసారథి రాజగోపాలాచారి
జీవిత భాగస్వామిప్రతిమ పటేల్
పురస్కారాలుపద్మ భూషణ్

కమలేశ్ డి.పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన ధ్యాన గురువు. ఆయనకు భారత ప్రభుత్వం 2023లో పద్మ భూషణ్ అవార్డును ప్రకటించగా,[1] ఆయన ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

కమలేష్ డి పటేల్ గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లో 1956లో జన్మించాడు. ఆయన ఫార్మసీ విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాజయోగ ధ్యానం మొదలుపెట్టి గురువు రామచంద్ర (బాపూజీ) దగ్గర 1976 నుంచి సాధన ఆరంభించాడు. కమలేష్ అహ్మదాబాద్ ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ చేశాక న్యూయార్క్ లో పీజీ చేసి అక్కడే ఫార్మా వ్యాపారం ప్రారంభించాడు. 1983లో గురువు రామచంద్ర (బాపూజీ) మరణంతో అధ్యక్షుడిగా పార్థసారథి రాజగోపాలాచారి(చారిజీ) బాధ్యతలు చేపట్టాక ఆయనతో కలిసి 2003 నుంచి శ్రీరామచంద్ర మిషన్ కార్యకలాపాల్లో భాగస్వామి అయ్యాడు.

కమలేష్ డి పటేల్ 2014 నుంచి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ భారత్ తో పాటు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యశాలలు నిర్వహించాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చెగూరులో 1400 ఎకరాల్లో శ్రీరామ చంద్ర మిషన్ (కన్హా శాంతివనం) విస్తరించాడు. ఆయన రాసిన ది హార్టుల్నెస్ వే పుస్తకానికి విశేష ఆదరణ లభించింది.

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (26 January 2023). "చినజీయర్, కమలేశ్ కు పద్మభూషణ్". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhra Jyothy (23 March 2023). "పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.
  3. Sakshi (26 January 2023). "పద్మభూషణులు.. హైదరాబాద్‌ నుంచి ఇద్దరికి పురస్కారాలు". Retrieved 26 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)