కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ
కరంచంద్ గాంధీ
జననం1822
పోర్‌బందర్, గుజరాత్, బ్రిటిష్ ఇండియా
మరణం16 నవంబరు 1885
జీవిత భాగస్వామిపుత్లీబాయి గాంధీ (వివాహం.1859)
పిల్లలు

కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ (1822 - 1885 నవంబరు 16)[1] కాబా గాంధీగా సుపరిచితుడు. అతను పోర్ బందరులో రాజకీయ నాయకుడు. అతను పోర్‌బందర్, రాజ్‌కోట్, వాంకనెర్ సంస్థానాలలో దీవాన్ గా పనిచేసాడు. అతను మహాత్మా గాంధీకి తండ్రి.

జీవిత విశేషాలు

గాంధీ కుటుంబం అప్పటి జునాగఢ్ రాష్త్రానికి చెందిన కుటియానా గ్రామానికి చెందినవారు.[2] 17వ శతాబ్ద చివరిలో లేదా 18వశతాబ్ద ప్రారంభంలో లాజ్జీ గాంధీ పోరుబందరుకు వెళ్ళి అప్పటి పాలకుడైన రాణా వద్ద ఉద్యోగంలో చేరాడు. అతని కుటుంబానికి చెందిన తరాలలో ఉత్తమ చంద్ గాంధీకి ముందు వరకు ఉన్న వారు రాష్ట్ర పరిపాలనా విభాగాలలో సివిల్ సర్వెంట్లుగా పనిచేసారు. ఉత్తమ్‌చంద్ గాంధీ గాంధీకి తండ్రి. అతను 19వ శతాబ్దంలో పోర్‌బందర్ రాణా అయిన ఖిమోజీరాజీ వద్ద దివాన్ గా పనిచేసాడు.[2] 1831లో రాణా ఖిమోజీరాజీ అకస్మాత్తుగా మరణించాడు. అతని కుమారుడు 12 యేండ్ల విక్మత్‌జీ. దీని ఫలితంగా రాణా ఖిమోజీరాజీ భార్య రాణీ రూపాలిబా తన కుమారుని కోసం రాజ్యపాలన చేపట్టింది. ఆమె వెంటనే ఉత్తమ్‌చంద్‌తో కలిసి జునాగఢ్ లోని తన పూర్వీకుల గ్రామానికి తిరిగి రావాలని బలవంతం చేసింది. జునాగఢ్ చేరిన ఉత్తమ చంద్ నవాబ్ ఎదుట నిలిచి తన ఎడమ చేతితో అభివాదం చేసాడు. తన కుడి చేయి పోర్ బందర్ సేవకు అంకితమైందని తెలిపాడు.

1841 లో, విక్మత్జీ సింహాసనాన్ని స్వీకరించాడు. ఉత్తమ్‌చంద్‌ను తన దివాన్‌గా తిరిగి నియమించాడు.

కరంచంద్ చాలా తక్కువ నియత విద్యను కలిగి ఉన్నాడు. కానీ అతని జ్ఞానం, అనుభవం అతన్ని మంచి నిర్వాహకుడిగా చేసింది. అతను దయ, ఉదారంగా ఉంటాడని, కానీ తక్కువ నిగ్రహాన్ని కలిగి ఉంటాడని చెప్పబడింది.[3]

తన తండ్రి ఉత్తమ్‌చంద్ గాంధీ వలె, కరంచంద్ గాంధీ పోర్‌బందర్ లో స్థానికంగా పాలిస్తున్న యువరాజు వద్ద కోర్టు అధికారి లేదా ముఖ్యమంత్రి అయ్యాడు. కరంచంద్ తన విధుల్లో భాగంగా పోర్‌బందర్ రాజకుటుంబానికి సలహా ఇవ్వడం, ఇతర ప్రభుత్వ అధికారులను నియమించడం వంటివి ఉండేవి.

కరంచంద్‌కు నియత విద్య లేదు. అతను తన తండ్రి చేస్తున్న పనులను చూడటం, మతపరమైన వేడుకలకు హాజరు కావడం ద్వారా అనుభవం నుండి జ్ఞానాన్ని పొందాడు. అయినప్పటికీ, అతను భౌగోళికం, చరిత్ర వంటి అంశాలలో ఎక్కువ జ్ఞానాన్ని పొందలేదు. ఏదేమైనా, కరంచంద్ పోర్‌బందర్ లో ముఖ్యమంత్రిగా రాణించాడు.[4]

కరంచంద్ తన ఉద్యోగంలో విజయం సాధించినప్పటికీ, అతను సంపదను కూడబెట్టడానికి మార్గాలు కనుగొనలేదు. గాంధీలకు తినడానికి పుష్కలంగా ఉండేది. వారికి గౌరవనీయమైన సేవకులు, కొన్ని మంచి ఫర్నిచర్ ఉండేది. కాని వారు ధనవంతులు కాదు. కరంచంద్ తీసుకువచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులను సరిపోయేది.[5]

కరంచంద్ నాలుగుసార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి మూడు వివాహాలు అతని భార్యల మరణాలతో ముగిశాయి; వారిలో ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చిన వెంటనే ఇద్దరు మరణించారు. తరువాత అతను 1859 లో పుతలీబాయి గాంధీని (1844 - 15 జూన్ 1891) వివాహం చేసుకున్నాడు, వారి వివాహ బంధం 1885 లో అతని మరణం వరకు కొనసాగింది. వారికి నలుగురు పిల్లలు కలిగారు. వారిలో ముగ్గురు కుమారులు లక్ష్మీదాస్ గాంధీ (1860 - 9 మార్చి 1914), కర్సాందాస్ గాంధీ (1866 - 22 జూన్ 1913), మహాత్మా గాంధీ (2 అక్టోబర్ 1869 - 30 జనవరి 1948) కాగా రాలియాత్ బెహన్ (1862 - డిసెంబర్ 1960) అనే కుమార్తె ఉంది. మహాత్మా గాంధీ అతని చిన్న కుమారుడు. అతని జీవితకాలంలోనే అతని పిల్లలందరికీ వివాహాలు చేసాడు.

1885 లో, కరంచంద్ ఫిస్టులా (బగంధరం) జబ్బుతో బాధపడ్డాడు. పుత్లీబాయి, ఆమె పిల్లలు (ముఖ్యంగా మోహన్‌దాస్) అతనిని చూసుకున్నారు. అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ, అతను స్వయంగా టాయిలెట్‌కు వెళ్ళడం కొనసాగించాడు. అతని పరిస్థితి రోజురోజుకు క్షీణించడం ప్రారంభమైంది. అన్ని రకాల వైద్య చికిత్సలను వైద్యులు అతనికి చేసినప్పటికీ, ఫలితం లేదు. తరువాత అతను దానికి శస్త్రచికిత్స చేయమని సూచించాడు. కాని అతని కుటుంబ వైద్యుడు అలా చేయడానికి నిరాకరించాడు. అతను అప్పటికే కొన్ని మందులు కొన్నాడు, కాని అవి పనికిరానివిగా మారాయి. కరంచంద్ జీవితంపై ఆశను కోల్పోయాడు. వెంటనే, అతని పరిస్థితి మరింత దిగజారింది. చివరగా, అతను నవంబర్ 16 వ తేదీన 63 సంవత్సరాల వయస్సులో దట్టమైన గాలులతో కూడిన రాత్రి మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Karamchand Uttamchand Gandhi
  2. 2.0 2.1 Gandhi before India. Vintage Books. 16 March 2015. pp. 19–21. ISBN 978-0-385-53230-3.
  3. "All about the Father of the Nation - Mahatma Gandhi". Archived from the original on 2014-08-19. Retrieved 2020-10-02.
  4. The Story of Gandhi (Complete Book Online)
  5. "Growing up in India"