కరుణాస్
కరుణాస్ | |
---|---|
Vice president of Tamilan Artistes' Association | |
Assumed office 10 October 2015 | |
Member of Tamil Nadu Legislative Assembly from Thiruvadanai constituency | |
In office 19 May 2016 – 2 May 2021 | |
President of Mukkulathor Pulipadai | |
In office 2015–2019 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Karunanidhi 1970 ఫిబ్రవరి 21 Kuruvikkarambai, Thanjavur, Tamil Nadu, India |
రాజకీయ పార్టీ | Mukkulathor Pulipadai |
జీవిత భాగస్వామి | Grace Karunas |
సంతానం | 2(including Ken Karunas) |
వృత్తి | Actor, comedian, musician, singer, politician |
కరుణాస్ (జననం:1970 ఫిబ్రవరి 21) కరుణానిధి సేతు.[1] భారతీయ నటుడు రాజకీయ నాయకుడు తమిళ సినిమాలో హాస్య నటుడుగా ఉన్నాడు. కరుణాస్ 2016 నుంచి 2021 వరకు తమిళనాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను 12 ఏళ్ళ వయసులోనే పాటలు పాడటం నేర్చుకున్నాడు. తరువాత తమిళ సినీ రంగంలోకి వెళ్లిన తర్వాత హాస్య నటుడిగా స్థిరపడ్డాడు. 2001లో వచ్చిన నందా సినిమాతో తమిళ సినీ రంగంలోకి ప్రవేశించాడు.
జీవిత చరిత్ర
[మార్చు]కరుణాస్ భారతదేశంలోని తమిళనాడులోని తంజావూరులోని కురువిక్కరంబై అనే గ్రామంలో జన్మించాడు. అతను తమిళనాడులోని లయోలా కళాశాలలో చదువుకున్నాడు. కరుణాస్ దాదాపు 200 సినిమాలలో నటించాడు. కరుణాస్ తన కెరీర్ ను కొరియోగ్రాఫర్గా, గాయకుడిగా ప్రారంభించాడు. [2] [3] ఆ తర్వాత క్రమంగా సినిమాల్లో హాస్యనటుడిగా కన్పించాడు. తర్వాత తమిళ సినిమాలో హాస్యనటుడిగా స్థిరపడ్డాడు. వడివేలు విను చక్రవర్తి లాంటి హాస్యనటుల సరసన నిలిచాడు. కరుణాస్ కు రాజకీయాల మీద ఆసక్తి ఉండటంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. 2016 నుంచి 2021 వరకు తమిళనాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు.[4] కరుణాస్ 2021 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం తమిళనాడు సినీ కళాకారుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు. కరుణాస్ తమిళనాడులో పలు విద్యాసంస్థలను నడుపుతున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Comedy proves a cakewalk". The Hindu. 15 February 2008. Retrieved 19 July 2018.
- ↑ "I cannot eat, sleep and breathe movies: Karunas". The Times of India. Archived from the original on 9 November 2013. Retrieved 19 July 2018.
- ↑ "Karunas opens up". Newindianexpress.com. Archived from the original on 4 March 2016. Retrieved 19 July 2018.
- ↑ Eenadu (13 April 2024). "రాజకీయ తెరపై తారల తళుకులు.. తమిళనాట పరిస్థితి ఇలా." Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.