కర్రీ & సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్
కర్రీ & సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్ | |
---|---|
ఆధారంగా | కూడతాయి సైనైడ్ హత్యలు |
రచయిత | షాలినీ ఉషాదేవి |
దర్శకత్వం | క్రిస్టో టామీ |
సంగీతం | తుషార్ లాల్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | మలయాళం |
సిరీస్‌ల | సంఖ్య |
ప్రొడక్షన్ | |
ఛాయాగ్రహణం | షెహనాద్ జలాల్ హరి కె. వేదాంతం |
ఎడిటర్లు | శృతి సుకుమారన్n ప్రవీణ్ ప్రభాకర్ |
ప్రొడక్షన్ కంపెనీ | ఇండియా టుడే ఒరిజినల్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | నెట్‌ఫ్లిక్స్ |
వాస్తవ విడుదల | 22 డిసెంబరు 2023 |
కర్రీ & సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్ కేరళలో జరిగిన ఆరు హత్యల ఆధారంగా క్రిస్టో టోమీ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ. కేరళలోని కూడతై గ్రామంలో 2019లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసుకు సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ సిరీస్‌ను నిర్మించారు.
జూలీ జోసేఫ్ అరెస్ట్‌తో ఈ డాక్యుమెంటరీ ప్రారంభమై జూలీ, రాయ్ పరిచయం, పెళ్లి నుంచి ఏం జరిగిందో రాయ్ కుటుంబ సభ్యులు రెంజీ (జూలీ మరదలు), రెమో (జూలీ పెద్ద కుమారుడు), రోజో (జూలీ బావమరిది) ఒక్కక్కరుగా చెబుతుంటారు. ఈ కేసుకు సంబంధించిన లీగల్ తదితర విషయాలను బీఏ అలూర్ (జూలీ డిఫెన్స్ లాయర్), నిఖిలా హెన్రీ (జర్నలిస్ట్), కేజీ సైమన్ (కేస్ ఇన్వెస్టిగేషన్ హెడ్), మేఘన శ్రీవాస్తవ్ (క్రిమినల్ అండ్ లీగల్ సైకాలజీ ఎక్స్‌పర్ట్), సీఎస్ చంద్రిక (రచయిత) వివరించారు.ఈ డాక్యుమెంటరీ 22 డిసెంబర్ 2023న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]కేరళలోని కూడతై గ్రామానికి చెందిన జూలీ జోసఫ్, రాయ్ థామస్ ఉత్తరాల ద్వారా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. రాయ్ థామస్‌కు అమ్మ అన్నమ్మ థామస్, నాన్న టామ్ థామస్, చెల్లెలు రెంజీ థామస్, సోదరుడు రోజో థామస్ ఉన్నారు. జూలీ జోసేఫ్ ఎంకామ్ చదడవంతో పెళ్లి చేసుకున్నాకా ఉద్యోగం చేస్తే ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తారు అని రాయ్ థామస్ తల్లి అన్నమ్మ వివాహానికి ఒప్పుకుంటుంది. పెళ్లై ఒక బాబు (రెమో రాయ్) పుట్టిన కొన్ని రోజులకు జూలీ థామస్‌ను ఉద్యోగం చేయమని తరచుగా చెబుతుంది అన్నమ్మ. ఈ క్రమంలోనే 2002లో హార్ట్ ఎటాక్‌తో అన్నమ్మ ఆ తర్వాత ఆరేళ్లకు 2008లో టామ్ థామస్ చనిపోతాడు. ఇలా థామస్ కుటుంబంలో ఒక్కొక్కరిగా ఎందుకు చనిపోతున్నారు? వారిని హత్య చేసింది జూలీనే అని ఎలా తెలుసుకున్నారు? వారిని ఆమె ఎలా చంపింది? ఎందుకు చంపింది? అనేదే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ కథ.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- నైంటీస్ (2024)
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (5 January 2024). "నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టిస్తున్న క్రైమ్ డాక్యుమెంటరీ". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
- ↑ Namaste Telangana (5 January 2024). "కూరలో విషం కలిపి 6 హత్యలు నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టిస్తున్న 'కర్రీ అండ్ సైనైడ్'". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 32 (help) - ↑ TV9 Telugu (22 December 2023). "ఒక మహిళ.. ఆరు హత్యలు.. ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)