కలగూరగంప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుపతి వేంకట కవులుగా దివాకర్ల తిరుపతిశాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి పేరొందరు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. వారు ఎన్నో శీర్షికాలుగా ప్రచురించగా మిగిలిన పద్యాలను, ఎందులోనూ ఇమడని వాటినీ ఇలా కలగూరగంపగా ప్రచురించారు.

ఇది కాత్యాయనీ గ్రంథమాల వారి చతుర్థపుష్పముగా దివాకర్ల వేంకటావధాని, తంగిరాల జగన్నాథశాస్త్రి గార్ల సంపాదకత్వంలో 1929 సంవత్సరంలో ముద్రించబడింది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కలగూరగంప&oldid=2949681" నుండి వెలికితీశారు