కలియుగము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కలి యుగము (దేవనాగరి: कली युग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగము. ఇది ప్రస్తుతము నడుస్తున్న యుగము. వేదాల ననుసరించి యుగాలు నాలుగు,

  1. సత్యయుగము
  2. త్రేతాయుగము
  3. ద్వాపరయుగము
  4. కలియుగము

కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతములో కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు .

కలియుగ లక్షణాలు[మార్చు]

కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=కలియుగము&oldid=2879410" నుండి వెలికితీశారు