కలియుగ రాజవంశములు
కలియుగ రాజవంశములు కోట వెంకటాచలం రచించిన పుస్తకం. దీనిని 1950 సంవత్సరంలో రచించి వారే విజయవాడ నుండి ముద్రించారు.
పాశ్చాత్యులు భారతీయుల చరిత్రను తమకు అనువైన రీతిలో నిర్మించి దేశచరిత్రకు తీవ్ర అన్యాయం చేశారని, దాన్ని సరిదిద్ది పురాణ వాౙ్మయం ఆధారంగా చరిత్ర రచన చేయాలన్న సఫలమైన ప్రయత్నాలు చేసిన కోట వేంకటాచలం ఆ క్రమంలోనే ఈ పుస్తకం రచించారు. రాజుల వంశాల క్రమాలు నక్షత్రమండలం గతిని ఆధారం చేసుకుని వేలయేళ్ళను పురాణాల్లో సవివరంగా గుర్తించేలాగా రచన చేశారని చెప్తూ వాటిని జ్యోతిష, గణిత శాస్త్రాల ఆధారంగా లెక్కకట్టిన వేంకటాచలం ఈ పుస్తకంలో దాని ఆధారంగా కలియుగంలో మన దేశాన్ని పాలించిన రాజవంశాల చరిత్రను రచించారు. ప్రాచీన కాలం నాటి బార్హద్రథ వంశం నుంచి ప్రారంభించి ఇటీవలి వేయి యేళ్ల మహమ్మదీయ, మరాఠా, బ్రిటీష్ పాలకుల వరకూ ఈ గ్రంథం పరిధి విస్తరించింది.
విషయసూచిక
[మార్చు]1. బార్హద్రథ వంశము
2. పద్యోత వంశము
3. శిశునాగ వంశము
4. నంద వంశము
5. మౌర్య వంశము
6. శుంగ వంశము
7. కాణ్వ వంశము
8. ఆంధ్రశాతవాహన వంశము
9. గుప్త రాజులు
10. ప్రమర వంశము
11. మహమ్మదీయ, మహారాష్ట్ర, బ్రిటిషు
12. కలియుగ రాజవంశావళి కాలము
13. పసిద్ధ చారిత్రక కాలములు
14. అవతారముల కాలములు
15. షడ్చక్రవర్తులు
16. గతించిన ప్రాచీన ప్రసిద్ధ రాజులకాలములు
17. అగ్నివంశపు రాజులు
18. ప్రమరవంశపు రాజులు
19. చయహానివంశపు రాజులు
20 శుక్ల లేక చాళుక్యవంశపు రాజులు
21. పరిహారవంశపు రాజులు
22. వైశ్యవంశపు రాజులు
23. పల్లవ, శక, కుషాను, హూణరాజులు
24. పల్లవ, శక, కుషాను రాజుల వివరములు