కల్యాణ్ బెనర్జీ (హోమియోపతి)
స్వరూపం
కళ్యాణ్ బెనర్జీ | |
---|---|
జననం | న్యూఢిల్లీ, భారతదేశం |
వృత్తి | హోమియోపతి |
ప్రసిద్ధి | హోమియోపతి |
పురస్కారాలు | పద్మశ్రీ |
కల్యాణ్ బెనర్జీ న్యూఢిల్లీకి చెందిన భారతీయ హోమియోపతివైద్యుడు. [1] మిహిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి పూర్వ విద్యార్ధి అయిన అతను 1977లో న్యూఢిల్లీలోని చిత్తరంజన్ పార్కులో డాక్టర్ కల్యాణ్ బెనర్జీ క్లినిక్ అనే హోమియోపతిక్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని స్థాపించాడు.[2] ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి వంటి అనేక ప్రభుత్వ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నాడు. గతంలో దాని పాలక మండలిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (సిసిఆర్ హెచ్) లో హోమియోపతిక్ ఫార్మాకోపియా కమిటీ, స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు.[3] వైద్య రంగంలో అతను చేసిన కృషికి గాను 2009లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Durgesh Nandan Jha (2009). "Nothing bitter here about HOMEOPATHY". Times of India. Archived from the original on 2 March 2016. Retrieved 24 February 2016.
- ↑ "8 docs among 26 Padma awardees". Times of India. 25 January 2009. Retrieved 24 February 2016.
- ↑ Biplob Ghosal (1 September 2015). "Homeopathy needs active promotion from Indian govt". Zee News. Retrieved 24 February 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.