కవితా సెల్వరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Medal record
ప్రాతినిధ్యం వహించిన దేశము  భారతదేశం
మహిళల కబడ్డీ
[ఆసియా క్రీడలు]]
స్వర్ణము 2010 గ్వాంగ్జౌ టీం

కవితా సెల్వరాజ్ కబడ్డీ క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. 2010లో గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన జట్టులో ఆమె సభ్యురాలు.[1][2] ఆమె భారత మహిళా కబడ్డీ జట్టు కోచ్ కూడా.

2010 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించడానికి ముందు 2007, 2008 ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లలో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించిన అద్భుతమైన కెరీర్ ఆమెది.

కవిత కబడ్డీలో తన కృషికి ధ్యాన్‌చంద్ అవార్డు (జీవితకాల సాఫల్యానికి) వరించింది.[3] భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం జనవరి 2024లో ఆమె అందుకుంది.

క్రీడలలో జీవితకాల సాఫల్యానికి ధ్యాన్ చంద్ అవార్డు, అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ క్రీడాకారులు, వారి పదవీ విరమణ తర్వాత క్రీడా ఈవెంట్‌ల ప్రమోషన్‌కు సహకరించే క్రీడాకారులను సత్కరించడానికి ప్రతియేటా ఇవ్వబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Vinod, A. (Nov 29, 2010). "Kerala still in celebratory mood after Asiad impression". The Hindu. The Hindu Group. Archived from the original on April 2, 2011. Retrieved 15 December 2012.
  2. "Colourful start to district youth fete". The Hindu. The Hindu Group. January 8, 2011. Retrieved 15 December 2012.
  3. "Proud moment for me: Indian women's kabaddi coach Kavitha Selvaraj on receiving Dhyan Chand Award". web.archive.org. 2024-08-17. Archived from the original on 2024-08-17. Retrieved 2024-08-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)