Jump to content

మైటోకాండ్రియా

వికీపీడియా నుండి
(కాండ్రియోసోము నుండి దారిమార్పు చెందింది)
Electron micrograph of a mitochondrion from mammalian lung tissue showing its matrix and membranes.

కాండ్రియోసోములు లేదా మైటోకాండ్రియాలు జీవకణంలో పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తిగల సూక్ష్మాంగాలు. ఇవి స్థూపాకారంలోగాని, గోళాకారంలోగాని ఉంటాయి. ఒక్కొక్కటిగా గాని సమూహాలుగా గాని ఉండవచ్చు. జీవనక్రియలు చురుకుగా సాగే కణాలలో ఇది చాలా అధికసంఖ్యలో ఉంటాయి. ఇవి రెండు పొరలతో ఏర్పడిన సూక్ష్మాంగాలు. ఈ పొరలు కణత్వచాన్ని పోలి ఉంటాయి. దీని వెలుపలి పొర చదునుగా ఉండగా, లోపలి పొర ముడతలుగా ఏర్పడి ఉంటుంది. ఈ ముడతలను క్రిస్టోలు అంటారు. ఇవి మాత్రికలోకి విస్తరించి ఉంటాయి. మాత్రికలో వలయాకారపు DNA, ATP, 70s రైబోసోములు, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ, కణాంతర శ్వాసక్రియకు అవసరమైన ఆక్సీకరణ ఎంజైములు ఉంటాయి. కణాలలో జరిగే అనేక జీవన క్రియా చర్యలకు అవసరమైన శక్తిని మైటోకాండ్రియాలు సిద్ధంచేసి ఉంచుతాయి. అందువల్ల వీటిని కణంయొక్క 'శక్త్యాగారాలు' అని వర్ణిస్తారు.


ప్రోకారియోటులలో మైటోకాండ్రియాలు ఉండవు, యూకారియోటులలో మాత్రమే ఉంటాయి. ఎంజైములను స్రవించు యూకారియోటు కణములలోను, శ్వాసక్రియకు తోడ్పడు కణములలోను మైటోకాండ్రియా అధిక సంఖ్యలో ఉంటాయి. క్షీరదాల ఎర్రరక్తకణాలలో కూడా ఇవి ఉండవు.

మైటోకాండ్రియా ఆకారము వివిధ కణములలో వేరువేరుగా ఉండును. గుండ్రముగాగాని, రేణువులవలెగాని, కడ్డీలవలెగాని, పోగులవలెగాని ఉండవచ్చును. కండరములలో ఇవి కడ్డీలవలెను, మూత్రపిండాలలో గుండ్రముగా ఉండును.

నిర్మాణము

[మార్చు]

పోర్టర్, పాలడ్ అను శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సహాయముతో మైటోకాండ్రియా యొక్క సూక్ష్మ నిర్మాణమును వివరించిరి. వీటిలోని శ్వాసక్రియ ఎంజైముల పాత్రను వార్ బర్గ్ పాలడ్ వివరించిరి.

మైటోకాండ్రియా పళ్ళెము లేదా సాసరు అకారములో 0.5 నుండి 1.0 మైక్రాన్ల వెడల్పుతోను, 1-8 మైట్రాన్ల పొడవుగా ఉండవచ్చును. ఉభయచరముల అండములలో అతి పెద్దవైన మైటోకాండ్రియాలు 20 నుండి 40 మైక్రాన్లు పొడవుతో ఉండును.

మైటోకాండ్రియాలు థర్మాస్ ప్లాస్క్ వలె రెండు ప్రమాణ త్వచములచే ఆవరించబడి యుండును. రెండు పొరలు 60 A0 మందముతో వాటి మధ్య పెరికాండ్రియల్ ప్రదేశము 100 A0 వెడల్పుతో ఉండును. వెలుపలి పొర ముడుతలు లేకుండా చదునుగా లోపలి పొరను ఆవరించి ఉండు. లోపలి పొర కొన్ని వేళ్ళవంటి నిర్మాణాలను మాత్రిక లోనికి పంపిస్తుంది. వీనిని క్రిస్టే లేక క్రెస్టులని అంటారు. క్రిస్టేల అమరిక వివిధ కణములలో వేరువేరుగ ఉండును. నాడీ, కండర కణములలో ఇవి సమాంతరముగాను, తెల్ల రక్తకణాలు, ప్రారాథైరాయిడ్ గ్రంథి కణములలో వల మాదిరిగా ఏర్పడును. కొన్ని జీవులలో మైటోకాండ్రియాఅలు క్రిస్టేలను ఏర్పరచవు. అందువలన వీటిని నునుపు లేదా చదును మైటోకాండ్రియాలు అంటారు. క్రిస్టేలలో ప్రాథమిక రేణువులు, F1 రేణువులు లేదా ఆక్సీసోములు ATP సింథటేజును కలిగివుండి ఎలక్ట్రాన్ రవాణాలో పాత్రవహించును. ఒక్కొక్క మైటోకాండ్రియాలోను సుమారు 104 నుండి 105 F1 రేణువులు ఉంటాయి.

విధులు

[మార్చు]
  • మైటోకాండ్రియాల ప్రథమ కర్తవ్యము కణశక్తి లేదా ATP ని సంశ్లేషణ చేయడము. ఈ క్రియలో జీవద్రవ్యములో గ్లూకోజు అవాయుగత ఆక్సీకరణ లేదా గ్లైకాలిసిస్ చెందును. ఒక గ్లూకోజు పరమాణువు రెండు పరమాణువుల పైరువిక్ ఆమ్లము నేర్పరచును. దీనివలన రెండు ATP పరమాణువులు ఏర్పడును.
  • శుక్ర కణము (Spermatozoa) మధ్యలో నున్న అక్షీయ పోగు చుట్టూ నెబన్ కర్న్ పొరను ఏర్పరచును. శుక్రకణం దీనినుండి శక్తిని గ్రహించి చురుకుగా కదులును.

బయటి లింకులు

[మార్చు]