Jump to content

కాండ్రేగుల (ఇంటిపేరు)

వికీపీడియా నుండి

కాండ్రేగుల తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

గోపికృష్ణ గా పేరు పొందిన శ్రీ  కాండ్రేగుల కృష్ణా రావు గారు,  రాజమండ్రి,  మచిలీపట్నం చెన్నై వాస్తవ్యులైన శ్రీ  కాండ్రేగుల జమీందారు గారు గా ఖ్యాతి వహించి పెద్ద జమీందారు శ్రీ శ్రీ శ్రీ రాజా కాండ్రేగుల శ్రీనివాస జగన్నాథరావు బహద్దూర్ గారి ముని మనవడు, తూర్పు గోదావరి,  పశ్చిమ గోదావరి,  కృష్ణ జిల్లా లలో  చాలా గ్రమాలు, ఊళ్ళు  వీరి జమీందారీ లో ఉన్నవే.

1) అనేక  దేవాలయాలను నెలకొల్పి కొన్ని వందల ఎకరాల భూమిని దాన పట్టాలు ఇచ్చి, ఇప్పటికీ  సొంత గా కొన్ని దేవాలయాలకి ఈయన  వంశపారంపర్య ధర్మకర్త గా వ్యవహరిస్తూ  ఆ దేవస్థానాలను  అభివృద్ధి చేస్తున్నవారు.


2) శ్రీ  కంచి పరమాచార్య గారు,  తదితర  కంచి,  శృంగేరీ పీఠాధిపతులు పలుమార్లు   ( రాజమండ్రి,  మచిలీపట్నం) ఉన్న వీరి గృహాలకు  అమ్మ వారి పీఠాలతో సహా  వచ్చి నివాసం  ఉండి చాతుర్మస్య దీక్షలు సహితం చేసుకునే వీలు ను కల్పించిన  మంచి  స్తోత్రీయ కుటుంబం వీరిది.

3) వీరి పూర్వీకుల చే రాజమండ్రి లో  స్థాపించి,   మొన్న మొన్న వరకు శ్రీ గోపికృష్ణ గారి హయంలో కూడా నడపబడిన  ప్రఖ్యాత వహించిన " శ్రీ  గౌతమి విద్యా పీఠం "  అనే సంస్కృత విద్యాలయం లో- ఒక మహో మహోపధ్యయ, (తర్క శాస్త్ర ప్రతిభ కలిగిన ) శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు,  వేదార్ధసామ్రాట్ - కి.శే శ్రీ రేమేళ్ళ సూర్య ప్రకాశశాస్రి గార్ల కి, సముచిత ప్రిన్సిపాల్ హోదాలు కల్పించి,  ప్రపంచం లోనే అతి అరుదైన అంశంగా  9 మంది రాష్ట్రపతి అవార్డుల  పొందిన అథ్యాపకుల ప్రధాన  భూమిక అయ్యి  సంస్థ గా  ఆ సంస్థ లో  staff కి, అధ్యపక,  ఉపాధ్యాయ బృందాలకి ఉచితంగా,  (ఇప్పుడు కొన్ని కోట్ల విలువైన) సుమారు 1500 చ.గ కి తక్కువ లేకుండా సొంత ఇళ్ళ స్థలాలు ఉచితంగా  ఇచ్చి వాళ్ళకి శాశ్వత  వసతిని  ఏర్పరిచి ,  తమ  విద్యా పీఠ  సంస్థ ద్వారా సంస్కృత, తెలుగు భాషా వ్యాప్తికై,  సొసైటీ కి ఎంతో సర్వీసు ను అందించిన విషయం మరువరాని చారిత్రక సత్యం

4)రాజమండ్రి సమీపంలోని రాజానగరం గామం లో శ్రీ రాజా కాండ్రేగుల జోగి జగన్నాథరావు పంతులు గారి పేరుతో వీరి పూర్వీకుల చే, బాటసారులకి ఉచిత  అన్నదాన సత్రం  నెల కొల్పి, నిర్వహణ కై ఇప్పుడు కొన్ని కోట్ల విలువైన సుమారు 1500 యకరాలు ఇచ్చిన ఘనత వీరి కుటుంబీకులదే.

5) శ్రీ బాలా త్రిపుర సుందరి వీరి ఇలవేల్పు అమ్మ వారి సహిత మేథాదక్షిణామూర్తి,  సోమేశ్వర స్వామి,  గోకర్ణేశ్వర స్వామి,  రాజ రాజరాజలింగేశ్వర స్వామి, శ్రీ కాళికేశ్వరస్వామి  తదితర శివాంశలు  కలిగిన దేవస్థానాలను స్థాపన,  పోషణ, నిర్వహణ కైనా అంకితమైన కుటుంబం వీరిది

చరిత్ర

[మార్చు]

కాండ్రేగుల ఇంటిపేరుగా కల కాండ్రేగుల జోగిపంతులు వారసులు 18 శతాబ్ది రెండో అర్థభాగం, 19వ శతాబ్ది తొలి అర్థభాగం కాలంలో దివితాలూకాను జమీందారీగా పరిపాలించారు. `1762 – 66 కాలంలో ప్రాంతీయ సభాపతి హోదా కలిగిన జాన్ సైబస్ కు దుబాసిగా, 1763-65 హైదరాబాద్ నవాబుతో ఈస్టిండియా కంపెనీ తరఫున రాయబారాలు చేసిన గొప్ప వ్యవహారవేత్త, రాజనీతివేత్త కాండ్రేగుల జోగిపంతులు. ఆయన చేసిన సేవలకు ప్రతిఫలంగా 1776లో దివి తాలూకాలోని భూములన్నిటినీ వందేళ్ళ కౌలుకు పొందారు. ఆ భూములు ఆయన తమ్ముని కుమారుడు కాండ్రేగుల జగ్గప్ప పేరుమీదుగా మళ్ళీ కౌలిచ్చారు. 1807లో కాండ్రేగుల జోగిపంతులు మనుమడు గోపాలరావుకు ఈ తాలూకాను జాగీరుగా ఇచ్చారు. 1812లో ఆయన మరణానంతరం వారి చిన్నతమ్ముడు కాండ్రేగుల జగన్నాధరావుకు సంక్రమించింది. తరవాత ఆయన వారసుడు గోపాలరావు జమీందారై కొన్నేళ్ళ తర్వాత మరణిస్తూ భార్యకు దత్తత హక్కునిస్తూ 1836లో మరణించారు. కారణాంతరాలచే 1853లో దివి జమీందారీని వేలం వేసి తిరిగి బ్రిటీష్ ప్రభుత్వమే కొనుక్కుంది.[1]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.