Jump to content

కాకర్లపూడి కృష్ణమూర్తి

వికీపీడియా నుండి

కాకర్లపూడి కృష్ణమూర్తి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రసాయన శాస్త్రవేత్త. ఆయన స్ఫటికాలుగా ఏర్పడని జిగట పదార్థాల రంగంలో విశేష పరిశోధనలు చేసారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన లండన్ విశ్వవిద్యాలయ ఆచార్యునిగా పనిచేస్తూ పరిశోధనలు చేసి డి.ఎన్.సి డిగ్రీని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మించి నాగపూర్ విశ్వవిద్యాలయ కళాశాలకు ప్రధానాచార్యునిగా పనిచేసారు. 1940 లో పి.హెచ్.డి పొంది జీవరసాయన రంగంలో పరిశోధనలు చేసారు.

సేవలు

[మార్చు]

ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో ఎలక్టెడ్ ఫెలోగా (1981), ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఫెలోగా (1974), పరిశోధనా కృషి చేసారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) సంస్థలో ప్రొఫెసర్ గా చాలాకాలం పనిచేసారు.

ప్రొఫెసర్ మూర్తి కార్బోహైడ్రేట్లు, స్వల్పంగా నీటిలో కరిగే చక్కెర పదార్థములు, మొదలగు వాటిపై పరిశోధనలు చేసారు. పాలీ శాకరైడ్లు, పెప్టైడో గ్లైకోన్, రాండం పాలీ శాకరైడ్ల యొక్క స్థిరీకరణ, వాటి నిర్మాణాల గురించి తొలిసారిగా పరిశోధించారు. పలు జాతీయ సంస్థల బహుమతి పురస్కారాలనందుకున్నారు. 1927 లో సర్ జె.సి.బోస్ అవార్డు అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 415.