అక్షాంశ రేఖాంశాలు: 16°58′30″N 82°16′44″E / 16.975°N 82.279°E / 16.975; 82.279

కాకినాడ ఓడరేవు

వికీపీడియా నుండి
(కాకినాడ పోర్టు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాకినాడ ఓడరేవు
బీచ్ నుండి చూస్తే కాకినాడ ఓడరేవు దృశ్యం
పటం
Click on the map for a fullscreen view
Location
Countryభారతదేశం
Locationఆంధ్రప్రదేశ్
Coordinates16°58′30″N 82°16′44″E / 16.975°N 82.279°E / 16.975; 82.279
Details
Opened1999 ఏప్రిల్ 1
No. of berths4 + 2 (నిర్మాణంలో ఉంది)
Statistics
Annual cargo tonnage145 లక్షల టన్నులు (2016-17)
Website
www.kakinadaseaports.in

కాకినాడ ఓడరేవు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో, విశాఖపట్నం ఓడరేవుకు దక్షిణాన 170 కి,మీ. దూరంలో ఉంది.[1]

కాకినాడ పోర్ట్ అనేది కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ ఫిషింగ్ హార్బర్, షిప్ బ్రేకింగ్ యూనిట్‌లు మొదలైనవాటితో కూడిన పెద్ద కాంప్లెక్స్. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు శతాబ్దాల చరిత్ర ఉంది.[2]

కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అన్ని కాలాల్లోనూ పనిచేసే డీప్ వాటర్ పోర్టు. దాని ఛానెల్ లోతు 12 మీటర్లుంటుంది. ఈ పోర్టులో 50,000 DWT వరకు ఉన్న నౌకలు రాగలవు. 2010-2011లో ఈ పోర్టు గుండా 10.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో కాకినాడ బీచ్‌ను అభివృద్ధి చేసింది. ఓడరేవు నుండి ఉప్పాడ ప్రాంతం వరకు 100 ఎకరాలలో ఈ బీచ్ విస్తరించి ఉంది.[1]

కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ను [3] 2011 లో ప్రారంభించారు.

కాకినాడ జిల్లాలో కాకినాడ గేట్‌వే పోర్ట్ పేరుతో కొత్త ఓడరేవు నిర్మాణంలో ఉంది. 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఇది మూడవ పోర్ట్ అవుతుంది.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Kakinada Deep Water Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 26 January 2013. Retrieved 2013-01-25.
  2. "Kakinada Anchorage Port". Department of Ports, Government of Andhra Pradesh. Archived from the original on 15 May 2013. Retrieved 2013-01-25.
  3. "Kakinada Port new railway station opened finally". South Central Railway. Retrieved 2013-01-25.
  4. https://www.thehindu.com/news/national/andhra-pradesh/aurobindo-realty-steps-up-construction-of-3000-crore-seaport-off-kakinada-coast-in-andhra-pradesh/article66069156.ece