కాకి (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకి
దర్శకత్వంమనోన్.ఎం
స్క్రీన్ ప్లేమనోన్.ఎం
నిర్మాతపత్తికొండ కిరణ్
తారాగణంఅశోక్
మేఘశ్రీ
జయసుధ
నాజర్
శ్రుతీ రామ కృష్ణన్
యోగిబాబు
ఛాయాగ్రహణంశరవణ్ నటరాజన్
సంగీతంఅమ్రిత్
నిర్మాణ
సంస్థ
అర్పితా క్రియేషన్స్
విడుదల తేదీ
2015 డిసెంబర్ 12
దేశం భారతదేశం
భాషతెలుగు

కాకి 2015లో తెలుగులో విడుదలైన హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా.[1] అర్పితా క్రియేషన్స్ బ్యానర్‌పై పత్తికొండ కిరణ్ నిర్మించిన ఈ సినిమాకి మనోన్.ఎం దర్శకత్వం వహించాడు.[2] కిరణ్ పత్తికొండ, అశోక్, మేఘశ్రీ, శ్రుతీ రామ కృష్ణన్, జయసుధ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలైంది.[3]

అమెరికాలో స్థిరపడిన కార్తీక్ (అశోక్), దీప్తి (మేఘాశ్రీ) జంట వైజాగ్‌లోని తమ ఫ్యాక్టరీలో ముఖ్యమైన పనులను చక్కదిద్దేందుకు తమ మిత్రుడు కిరణ్ (కిరణ్)తో కలిసి వైజాగ్‌కి వచ్చి తమ సొంత ఇంటిలో నివాసం ఉంటారు. ఫ్యాక్టరీ పనుల మీద కార్తీక్ ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత మేఘాశ్రీ విచిత్ర పరిస్థితులను ఎదుర్కుంటూ ఉంటుంది. అదే బంగ్లాలో ఉండే వాచ్‌మెన్ కూతురు అమ్ములోకి (బేబీ యువీనా) ఓ ఆత్మ జొరబడడంతో ఆ పాప విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఏంటి? అమ్ములోకి జొరబడిన ఆత్మ ఎవరు? ఆమెకు కార్తీక్, దీప్తిల జంటకు ఉన్న సంబంధం ఏంటి? చివరి ఈ పరిస్థితులన్నింటి నుంచీ వీరంతా ఎలా బయటపడ్డారు అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: అర్పితా క్రియేషన్స్
  • నిర్మాత: పత్తికొండ కిరణ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మనోన్.ఎం
  • సంగీతం: అమ్రిత్
  • సినిమాటోగ్రఫీ: శరవణ్ నటరాజన్
  • మాటలు: వినోద్ శివ
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రోనాల్డ్ రాజ్ ఎస్. విలియమ్స్.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 September 2015). "భయపెట్టే కాకి!". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  2. Sakshi (16 June 2015). "బాబోయ్ 'కాకి'!". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  3. Sakshi (28 July 2015). "కొంచెం నవ్వు... కొంచెం భయం". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.

బయటి లింకులు

[మార్చు]