కాటలిన్ కరికో
కొవిడ్ - 19 మహమ్మారిపై పోరాటం కోసం సమర్థవంతమైన ఎం ఆర్ ఎన్ ఎ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన కాటలిన్ కరికో కు వైద్యశాస్త్ర విభాగంలో 2023 నోబెల్ పురస్కారం దక్కింది.[1] కరోనా వైరస్ కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వీరి పరిశోధనలు దోహదపడ్డాయని అవార్డు ఎంపిక కమిటీ తెలియజేసింది. కాటలిన్ కరికో స్వస్థలం హంగరీ కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైన 13 మహిళగా ఈమె గుర్తింపు పొందారు. కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్ ఇద్దరికీ కలిపి ఈ ఏడాది నోబెల్ పురస్కారం వచ్చింది.[2] న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులు చేయడం ద్వారా కొవిడ్ వైరస్‌కు వ్యతిరేకంగా అత్యంత సమర్ధమంతంగా పనిచేసే వ్యాక్సిన్లను ఉభయులు ఆవిష్కరించారని కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. వారి ఆవిష్కరణతో మన వ్యాధి నిరోధక శక్తితో ఎంఆర్‌ఎన్‌ఏ వ్యవహార శైలి పట్ల మనకు ఉన్న అవగాహన పూర్తిగా మారిపోయిందని తెలిపింది. ”అధునాతన కాలంలో మానవాళి ఆరోగ్యానికి పెను ముప్పు ఎదురైనప్పుడు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో నోబెల్ పురస్కార విజేతలు అనూహ్యమైన పాత్ర పోషించారు” అని నోబెల్ పురస్కార కమిటీ కొనియాడింది.[3] కాటలిన్ కరికో ప్రస్తుతం అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీతోపాటు హంగారిలోని హంగేరి లోని సెకండ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
కాటలిన్ కరికో నేపథ్యం :
[మార్చు]కాటలిన్ కరికొ హంగేరిలోని జోల్‌నోక్‌లో 1955లో జన్మించారు. 1982లో జెగెడ్ విశ్వవిద్యాలయం నుంచి ఆమె పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలోని హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఆమె 1985 వరకు పోస్ట్‌డాక్టోరల్ రీసేర్చ్ చేసారు.[4] 1989లో పెన్‌సెల్వేనియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2013 వరకు అదే ఉద్యోగంలో కొనసాగారు. అనంతరం బయోఎన్‌టెక్ ఆర్‌ఎన్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌లో తొలుత వైస్ ప్రెసిడెంట్‌గా, ఆ తర్వాత సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 2021 నుంచి జెగెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, పెన్‌సెల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరెల్ మెన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.
మూలాలు :
- ↑ "కొవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కర్తలకు నోబెల్.. శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు అత్యున్నత పురస్కారం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-02. Retrieved 2023-10-05.
- ↑ "Nobel Prize Physiology or Medicine 2023: వైద్య శాస్త్రంలో కాటలిన్, వెయిస్‌మన్‌కు నోబెల్". Sakshi Education. Retrieved 2023-10-05.
- ↑ ABN (2023-10-03). "ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనకు వైద్య నోబెల్". Andhrajyothy Telugu News. Retrieved 2023-10-05.
- ↑ "టీకా యోధులకు నోబెల్". EENADU. Retrieved 2023-10-05.