Jump to content

కాదంబరి కదమ్

వికీపీడియా నుండి
కాదంబరి కదమ్
జననం (1988-10-13) 1988 అక్టోబరు 13 (వయసు 36)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1991 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అవఘాచి సన్సార్‌
తుజ్విన్ సఖ్యా రే
జీవిత భాగస్వామి
అవినాష్ అరుణ్‌
(m. 2016)
పిల్లలు1

కాదంబరి కదమ్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. అవఘాచి సన్సార్‌, తీన్ బహురానియన్‌ వంటి సీరియళ్ళతో ప్రసిద్ధి చెందింది. 2011లో తుజ్విన్ సఖ్యా రే సీరియల్ లో రాధిక పాత్రలో నటించింది.[1]

జననం

[మార్చు]

కాదంబరి కదమ్ 1988, అక్టోబరు 13న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ముంబైలోని గోరేగావ్ విద్యామందిర్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2016 నవంబరు 10న సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అవినాష్ అరుణ్‌తో కాదంబరి కదమ్ వివాహం జరిగింది. 2018 మే 2న మొదటి కుమారుడు (కార్తీక్) జన్మించాడు.

సినిమారంగం

[మార్చు]

తన 3 సంవత్సరాల వయస్సులో మొదటి స్టేజ్ ప్రదర్శన ఇచ్చింది. కెహతా హై దిల్, కభీ సౌతాన్ కభీ సహేలీ, తీన్ బహురానియన్ వంటి మరెన్నో సీరియల్స్ చేసింది. కాదంబరి కదమ్ తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌కు ప్రసిద్ధి చెందింది.[2][3]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినియా పాత్ర ఇతర వివరాలు
2006 హాయ్ పోర్గి కునాచి గౌరీ సావంత్ లీడ్ పాత్రతో అరంగేట్రం
2008 పట్ల తర ఘ్య అదితి ప్రధానపాత్ర
2009 తులా షిక్విన్ చాంగ్లాచ్ ధడా మకరంద్ గర్ల్ ఫ్రెండం ప్రధానపాత్ర
2010 ఆఘాత్ సంగీత ప్రధాన్ క్యారెక్టర్ రోల్
2010 క్షణభర్ విశ్రాంతి మానసి ప్రధానపాత్ర
2012 అజింక్య సాయి ధర్మాధికారి ప్రధానపాత్ర
2013 మంగళాష్టకం వన్స్ మోర్ రేవా క్యారెక్టర్ రోల్
2019 ది సైలెన్స్ మందాకిని ప్రధానపాత్ర
2021 భూమిక ప్రధానపాత్ర

నాటకరంగం

[మార్చు]
సంవత్సరం నాటకం పాత్ర భాష
2022 చార్చౌగి వైజూ మరాఠీ

మూలాలు

[మార్చు]
  1. "Marathi-cinema lost-marathi-actors-from-movies-serials". Lokmat.
  2. "Kadambari Kadam Biography, Husband, Hot, Wiki, Photos". Marathi.TV. 28 October 2014. Retrieved 2022-12-25.
  3. "Kadambari Kadam : Biography, wiki, age, height, husband, images". justmarathi.com. Retrieved 2022-12-25.

బయటి లింకులు

[మార్చు]