కామినీ రావు
డా. కామినీ ఎ రావు | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | సెంట్ జాన్స్ మెడికల్ కాలేజీ, బెంగళూరు |
Medical career | |
Profession | మెడికల్ డైరెక్టరు, మిలాన్, గైనకాలజిస్టు |
Sub-specialties | పునరుత్పత్తి వైద్యం, అసిస్టెడ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ |
Awards | పద్మశ్రీ award for Medicine-Reproductive Medicine in 2014 |
డాక్టర్ కామినీ ఎ. రావు భారతదేశంలో సహాయ పునరుత్పత్తి రంగంలో అగ్రగామి. రిప్రొడక్టివ్ ఎండోక్రినాలజీ, అండాశయ శరీరధర్మ శాస్త్రం, సహాయక పునరుత్పత్తి సాంకేతికత రంగాల్లో ఆమె నిపుణురాలు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని అందుకుంది. డాక్టర్ కామినీ రావు మిలాన్ - సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ (BACC హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యూనిట్)లో మెడికల్ డైరెక్టరు.[1]
జీవితం, వృత్తి
[మార్చు]కామినీ రావు విద్యాభ్యాసం బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివింది. డాక్టర్ కామిని, లండన్ లోని కింగ్స్ కాలేజ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని హారిస్ బర్త్‌రైట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఫీటల్ మెడిసిన్ కు చెందిన ప్రొఫెసర్ కైప్రోస్ నికోలైడ్స్ వద్ద వృత్తిపరంగా ఫీటల్ ఇన్వేసివ్ థెరపీలో శిక్షణ పొందింది. ఇంగ్లాండు, మిడిల్స్‌బ్రో లోని సౌత్ క్లీవ్‌ల్యాండ్ హాస్పిటల్‌లో ప్రొఫెసరు రే గారీ వద్ద లేజర్ సర్జరీ శిక్షణ పొందింది.
కామినీ రావు భారతదేశపు మొట్టమొదటి SIFT బేబీకి జన్మనిచ్చిన ఘనత సాధించింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సెమెన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ICSI (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) ద్వారాను, లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ద్వారానూ దక్షిణ భారతదేశంలో జన్మించిన మొదటి శిశువులను ఇంజినీరింగ్ చేసిన ఘనత ఆమెదే.
ఇంగ్లాండు నుండి భారతదేశానికి తిరిగివచ్చాక ఆమె, BACC హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పునరుత్పత్తి వైద్యశాలను స్థాపించింది. ఇప్పుడు దాన్ని మిలాన్ - సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అంటారు. భారతదేశం నుండి మాత్రమే కాకుండా యుకె, అమెరికా, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యాల నుండి, పొరుగు దేశాల నుండి, అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా రోగులు ఇక్కడికి వస్తారు.
పురస్కారాలు
[మార్చు]- 2014 లో పద్మశ్రీ పురస్కారం
- వైద్యరంగంలో ఎనలేని సేవలందించినందుకు కర్ణాటక రాష్ట్ర రాజ్యోత్సవ పురస్కారం. [2]
- వైద్య రంగంలో ఎనలేని సేవలందించినందుకు విద్యా రతన్ పురస్కారం.
- హైదరాబాద్‌లోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుండి దేశానికి, వృత్తికీ అంకితమైన సేవ కోసం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ హానర్స్ ట్రిబ్యూట్ పురస్కారం.
- వైద్య రంగంలో ప్రతిభ కనబరిచినందుకు ఆర్యభట్ట కల్చరల్ ఆర్గనైజేషన్ నుండి ఆర్యభట్ట పురస్కారం.
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ షిమోగా జిల్లా యూనిట్ నుండి BC రాయ్ జిల్లా పురస్కారం.
- బెంగుళూరు సొసైటీ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం
- ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ & గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం
- నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ [3] ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ "Six from Karnataka chosen for Padma awards". The Hindu. 26 January 2014. Retrieved 21 August 2014.
- ↑ Ronamai, Raymond (17 January 2012). "Rhea Healthcare to set up motherhood boutique birthing centers at Chennai Kochi". International Business Times. Retrieved 21 August 2014.
- ↑ "List of Fellows - NAMS" (PDF). National Academy of Medical Sciences. 2016. Retrieved 19 March 2016.