కామినేనివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కామినేనివారి పాలెం గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామములోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామ పొలాలకు కావూరు ఛానల్ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

కామినేనివారి పాలెం, ఆరుంబాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రామాలయం

[మార్చు]

ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరియూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారూ సంయుక్తంగా నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు, 2014, మార్చి-11 నుండి 14 వరకూ జరిగినవి. చివరి రోజున మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమాలకు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులకు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. [2]

శ్రీ దుర్గామాతా అమ్మవారి ఆలయం

[మార్చు]

కామినేనివారిపాలెంలో, 1997వ సంవత్సరంలో, తొలిఏకాదశి రోజున గ్రామానికి చెందిన రైతు శ్రీ బొలగాని శివయ్య తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా, దుర్గామాతా అమ్మవారి రాతి విగ్రహం బయల్పడినది. అక్కడే అమ్మవారికి దేవాలయం నిర్మించారు. గ్రామస్తుల సహకారంతో ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వచ్చుచున్నది. ఆ రోజున గ్రామంలోని మహిళలు పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పసుపు, కుంకుమలు సమర్పించెదరు. కనక తప్పెట్లతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించెదరు. ఈ సంవత్సరం, 2014, జూలై-8న తొలిఏకాదశి నాడు ఈ ఆలయంలో అమ్మవారి 17వ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. [3]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, మే నెల-21వ తేదీ గురువారం నుండి 23వ తేదే శనివారం వరకు వైభవంగా నిర్వహించారు. 23వ తేదీ శనివారంనాడు, వేదపండితులు హోమాలు నిర్వహించి, ఉదయం 9-30 గంటలకు, మంత్రోచ్ఛారణలతో, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. గ్రామ మహిళలు బిందెలతో, స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించునారు. ఈ సందర్భంగా గ్రామములో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. అనంతరం మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ గావించారు. [4]

గ్రామంలోని ప్రధాన పంటలు

[మార్చు]

ఈ గ్రామములో ప్రధాన పంట వరి.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]