కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.

పాట[మార్చు]

పల్లవి :

కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా | | కారులో | |

నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే

వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో | | నిన్నుమించిన | | | | కారులో | |


చరణం 1 :

చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా

మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా

కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి

చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

నిలిచి విను నీ బడాయి చాలు

తెలుసుకో ఈ నిజానిజాలు


చరణం 2 :

గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా

జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా

చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు

చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన

నిలిచి విను నీ బడాయి చాలు

తెలుసుకో ఈ నిజానిజాలు

వివరణ[మార్చు]

ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయికి అర్ధమయ్యేటట్లుగా పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం. మనం జీవితంలో అనుభవిస్తున్న ఎన్నో సుఖాలకు వెనుక ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి వుంటుందనే జీవితసత్యాన్ని తెలియజేస్తుంది ఈ పాట. వానికి గృహ నిర్మాణ రంగంలోని మేస్త్రీలను, దుస్తుల్ని తయారుచేసే నేతగాళ్ళను రెండు ఉదాహరణలుగా చెబుతాడు. చివరికి "చాకిరొకడిది సౌఖ్యమొకడిది" తెలుగుకోమని అంటాడు

మూలాలు[మార్చు]

  • కారులో షికారుకెళ్ళే, మనసు గతి ఇంతే (ఆత్రేయ సినీ హిట్స్), సేకరణ : సంజయ్ కిషోర్, సంగమ్ అకాడెమీ, హైదరాబాద్, 2007, పేజీ: 21.పాట చాలా నచ్చింది