కార్ల్ సేగన్
కార్ల్ సేగన్ | |
---|---|
జననం | కార్ల్ ఎడ్వర్డ్ సేగన్ 1934 నవంబరు 9 బ్రూక్లిన్, న్యూయార్క్, అమెరికా |
మరణం | 1996 డిసెంబరు 20 సియాటిల్, వాషింగ్టన్, అమెరికా | (వయసు 62)
రంగములు |
|
వృత్తిసంస్థలు |
|
చదువుకున్న సంస్థలు | యూనివర్శిటీ ఆఫ్ షికాగో (బి.ఎ, బి. ఎస్. ఎం.ఎస్, పి.హెచ్.డి) |
పరిశోధనా సలహాదారుడు(లు) | గెరార్డ్ కూపర్[1] |
డాక్టొరల్ విద్యార్థులు | |
ప్రసిద్ధి | |
ముఖ్యమైన పురస్కారాలు | Klumpke-Roberts Award (1974) NASA Distinguished Public Service Medal (1977) Pulitzer Prize for General Non-Fiction (1978) Oersted Medal (1990) Carl Sagan Award for Public Understanding of Science (1993) National Academy of Sciences Public Welfare Medal (1994) |
సంతకం |
కార్ల్ ఎడ్వర్డ్ సేగన్ (1934 నవంబరు 9 - 1996 డిసెంబరు 20) ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, రచయిత. ఇతర గ్రహాలపై జీవం గురించి చేసిన పరిశోధనల వల్ల శాస్త్రీయ సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందాడు. కేవలం ప్రాథమిక రసాయనాలను, రేడియేషన్ ఉపయోగించి జీవానికి ఆధారభూతమైన అమైనో ఆమ్లాలను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసి చూపించాడు. 1985 లో గ్రీన్‌హౌస్ ప్రభావం వలన భూమి వాతావరణంలో మార్పులు వస్తాయని అమెరికన్ కాంగ్రెస్ కి నిరూపించారు.[3][4]
మొదట్లో హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసిన సేగన్ ఆ తరువాతి కాలంలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో తన జీవితంలో ఎక్కువ కాలం పాటు సేవలందించాడు. తన జీవిత కాలంలో దాదాపుగా 20 పుస్తకాలు, 600కు పైగా పరిశోధనా పత్రాలు రచించాడు. ఈయన రచనల్లో ది డ్రాగన్స్ ఆఫ్ ఇడెన్, బ్రొకాస్ బ్రెయిన్, పేల్ బ్లూ డాట్ లాంటి పుస్తకాలు జనాదరణ పొందాయి. ఈయన 1980 లో సహా రచయితగా వ్యవహరించిన కాస్మోస్- ఎ పర్సనల్ వాయేజ్ అనే దూరదర్శన్ ధారావాహిక దాదాపుగా అరవై దేశాలలో 50 కోట్ల మంది ప్రజలు వీక్షించారు.
ప్రారంభ జీవితం
[మార్చు]సేగన్ 1934 నవంబరు 9న అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో జన్మించాడు. ఇతని తండ్రి సామ్యూల్ సేగన్ రష్యన్ సామ్రాజ్యం(ఇప్పటి ఉక్రెయిన్) నుండి అమెరికా దేశానికి వలసదారుడిగా వచ్చి స్థిరపడ్డాడు, తల్లి రచెల్ మొలీ న్యూయార్క్ వాసి. రచెల్ అమ్మ అమ్మ పేరు చైయ క్లారా, ఆమె గుర్తుగా సేగన్కి ఆ పేరు పెట్టుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 కార్ల్ సేగన్ at the Mathematics Genealogy Project
- ↑ Davidson, Keay (1999). Carl Sagan A Life, John Wiley & Sons ISBN 0-471-39536-6 (This book is dedicated to Pollack)
- ↑ Sagan, Carl; Head, Tom (2006). Conversations with Carl Sagan (illustrated ed.). University Press of Mississippi. p. 14. ISBN 978-1-57806-736-7. Extract of page 14
- ↑ Carl Sagan testifying to Congress, December 10, 1985, C-SPAN, https://www.c-span.org/video/?125856-1/greenhouse-effect