కాళికాలయం
కాళికాలయం ప్రముఖ రచయిత మధు బాబు రచించిన తెలుగు అపరాధనా పరిశోధక నవల.
ఇది మూడు భాగాలుగా ముద్రించబడింది. మొదటిది కాళికాలయం కాగా రెండవది కంకాళలోయ, మూడవది కళ్యాణ తిలకం.
రాజులు, రాణులు మాంత్రికులు, అడవులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు మొదలైన వాటితో నిండిన ఒక అద్భుత జానపద ప్రపంచంలో మధుబాబు సృజించిన కాళికాలయం నవల.
సంక్షిప్త కథ
[మార్చు]ఒక రాజ్యంలో కన్యపిల్లలను అంతుపట్టని పొగ శక్తి హరించుతున్నది. ఆ మంత్రబలం మహారాజుగారిని మైకంలోకి నెట్టినది. దాని నుండి విముక్తి మార్గం వెతకడం కోసం యువరాజు గురుకులం నుండి అత్యవసరంగా పిలిపించబడ్డాడు. కార్యసాధన కోసం బయలుదేరిన యువరాజు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు? యువరాజుకు తోడుగా బయల్దేరిన బలదేవుడు, వసంతుడు బలాబలాలు ఎలాంటి సాహసయాత్రలు చేశారు. ఆముఖుని మంత్రతంత్రాలు ఎంత శక్తివంతమైనవి?
వసంతుడు, బలదేవుడు పూటకూళ్లమ్మ ఇంట్లో ఉండి, ఆ రాజ్యపు అంతఃపుర రహస్యం ఎలా ఛేదించారు ? కొండలపై నిద్రపోతున్న యక్షిణి రహస్యాన్ని ఎలా ఛేదించారు, దుష్ట మాంత్రికుడు ఆముఖుడి ఆట ఎలా ముగిసింది.