కాళ్లకూరి గోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళ్లకూరి గోపాలరావు

ఇతని స్వస్థలం కాకినాడ. కానీ జీవితంలో అధిక భాగం మద్రాసులో జీవించాడు. ఇతడికి బాల్యం నుండే సహజ కవితాధోరణి అబ్బింది. ఇతడు 16వ యేట వ్రాసిన నీతికథా సంగ్రహము ఆంధ్రదేశ ప్రభుత్వం వారిచే 1,2,3 ఫారముల వారికి పాఠ్యగ్రంథంగా నిర్ణయించబడింది. ఇతడు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని తెలుగు పుస్తకాలకు వివరణ పట్టిక తయారు చేసే పనిలో కొంతకాలం వినియోగించబడ్డాడు. చెన్నపురి ఆంధ్రసభ వ్యవస్థాపకులలో ఇతడు ఒకడు. విక్టోరియా గ్రంథాలయాధికారిగా కొంతకాలం పనిచేశాడు. ఆంధ్రపత్రిక సంపాదకమండలిలో సభ్యుడిగా ఉన్నాడు.[1]

రచనలు

[మార్చు]
  1. నీతికథా సంగ్రహము
  2. కవిత్వోపాయనము
  3. అపూర్వ సంఘసంస్కరణము[2]
  4. వాల్మీకి (నాటకము)[3]
  5. సుపరిష్కృత చంద్రరేఖా విలాపము
  6. కళ్యాణరాఘవము
  7. వసంతసేన

బిరుదములు

[మార్చు]
  • కవిశేఖర

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1917). "కాళ్లకూరి గోపాలరావు గారు". ఆంధ్రపత్రిక ఉగాది సంచిక: 278. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 28 November 2017.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి