కావ్యాత్మ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
ఉపోద్గాతం
[మార్చు]శబ్దం కావ్యం అని కొందరలకారికులు చెప్పారు.శబ్దార్ధాలు రెండూ కలిసి కావ్యం అవుతుందని మరికొందరాలన్కారికులు చెప్పారు.
కావ్యాత్మ నిర్వచనం
[మార్చు]ఏదివున్నంత మాత్రంచేత కావ్యానికి కావ్యత్వం సిద్ధిస్తుందో, ఏదిలేకుండా ఇతరాలు ఎన్ని ఉన్నా కావ్యానికి కావ్యత్వం సిద్ధింపదో అదే కావ్యాత్మ.భారతీయ అలంకారికులు కావ్యాన్ని కాంతతో పోల్చారు.కావ్యాంగాలైన రసం, అలంకారం, ధ్వని, గుణము. మొదలగువాటిలో కావ్యాత్మ స్థానీయం ఏది . అనే విషయంలో భారతీయ అలంకారికుల భిన్నాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.కావ్యాత్మ గురించి భారతీయ అలంకారికులు వి విధ సిద్ధాంతాలు వ్యక్తం చేసారు.వీటికి భారతీయ అల్న్కారికుల దృక్పథాలుఅని అంటారు.
కావ్యాత్మ - వివిధ సిద్ధాంతాలు
[మార్చు]సిద్ధాంతం | అలంకారికుడు | గ్రంథం |
రస సిద్ధాంతం | భరతుడు | నాట్యశాస్త్రం |
అలంకార సిద్ధాంతం | భామహుడు | కావ్యాలంకారం |
గుణ | దండి | కావ్యాదర్శం |
రీతి | వామనుడు | కావ్యాలంకార సూత్ర వృత్తి |
ధ్వని | ఆనందవర్ధనుడు | ధ్వన్యాలోకం |
వక్త్రోక్తి | కుంతకుడు | వక్త్రోక్తో జీవితం |
అనుమాన | మహిమ భట్టు | వ్యక్తి వివేకం |
ఔచిత్య | క్షేమేంద్రుడు | ఔచిత్య విచార చర్చ |
విమర్శలు
[మార్చు]సాహిత్య విమర్శ అనే ఆలోచన ఆధునికమైనది.ప్రాచీన భారతీయ అలంకారికులు విమర్శ అనే పదాన్ని ఈ ఈ ఆలోచనలో వాడలేదు.అలంకారికులు విమర్శ అనే పదానికి బదులు లక్షణ అనే పదాన్ని వాడారు.భాషాలక్షణాలని వ్యాకరణం నిరూపించినట్లే కావ్యలక్షణాలని అలంకారశాస్త్రం నిరూపిస్తుంది.
భరతుడు: భరతుని దృష్టిలో కావ్యం అంటే రూపకమే. ఇతివృత్తంతు నాట్యష్య శరీరం పరికీర్తితం అనగా కావ్యంలో ఇతివృత్తం శరీరం.ఇతడు రసప్రాముఖ్యాన్ని మాత్రం అంగీకరించాడు.విభావానుభావ వ్యభిచారి సమ్యొగాద్రసనిశ్పత్తిః అని రస సూత్రాన్ని భారతాడు నిర్వచించాడు.
భామహుడు: శబ్దార్దౌ సహితౌ కావ్యం అనగా భామహుడి మతంలో శబ్దార్ధాలు రెండూ కావ్యశరీరం.భరతుడు దృశ్యకావ్యానికి రసం ప్రధానం అని చెప్పితే, భామహుడు శ్రవ్యకావ్యానికి అలంకారమే ప్రధానం అని చెప్పాడు.
దండి: దండి 6వ శతాబ్దానికి చెందినవాడు.కావ్యానికి ఆత్మా గుణం అని ఇతని భావన.మొదటగా గుణాల్ని వివరించినవాడు భరతుడు.ఐతే గుణసిద్ధాంత స్థాపకుడు దండి.అలంకారాలు బాహ్య సౌందర్య హేతువులని, గుణాలు అంతః సౌందర్య హేతువులని దండి పేర్కొన్నాడు.శరీరం తావదిష్టార్త వ్యవచ్చిన్నా పదావలీ అనగా రమణీయార్థ భూషితమైన శబ్దమే కావ్యం అని దండి అభిప్రాయం.
వామనుడు: వామనుడు 9వ శతాబ్దానికి చెందినవాడు.రీతిరాత్మా కావ్యస్య విశిష్టా పదరచనా రేతిః విశేషో గుణాత్మా అనగా కావ్యానికి రీతి ఆత్మ.విశిష్టమైన పదరచనమే రీతి.గుణాలతో కూడివుండడమే విశేషం అని చెప్పాడు.
ఉద్భటుడు: భామహుని భామహాలంకారికి వివరణ రాసాడు.ఇతడు రసాన్ని అలంకార భేదంగానే పేర్కొన్నాడు.
రుద్రటుడు: అలంకర మతానుసారి అయినాసరే రసహీనమైన రచన నిష్ప్రయోజనం అని స్పష్టం చేసాడు.
కావ్యానికి ఆత్మ ధ్వని అని ఆనందవర్థనుని వాదం.అది వస్తు అలంకార రసాత్మకమై మూడు విధాలుగా ఉంటుందని చెప్పాడు.అభినవగుప్తుడు ధ్వన్యాలోకంకి లోచనంఅనే వ్యాఖ్యానం వ్రాసి రస సిద్ధాంతానికి పరిపుష్టి కలిగించాడు.
కుంతకుడు వక్రోక్తిః కావ్య జీవితం అని ప్రతిపాదింప్రతిపాదించాడు.ఇతడు వక్రోక్తిని ఆరు విధములుగా చెప్పాడు.వర్ణ విన్యాస, పదపూర్వార్థ, ప్రత్యయ, వాక్య, ప్రకరణ, ప్రబంధ వక్రతములు అని ఆరు విధములు. చమత్కార జనకమే వక్రోక్తి. చమత్కారమే కావ్య శరీరం అని ఇతని మతం.
మహిమభట్టు సిద్ధాంతం అంతా అనుమానంపై ఆధారపడి ఉంది.ఇతని వ్యక్తివివేకం అనే గ్రంథం ధ్వన్యాలోకంకి ఖండన గ్రంథం.ఇతని మతంలో శబ్దార్థాలు రెండూ కావ్యశరీరం.
క్షేమేంద్రుడి దృష్టిలో రససిద్ధమైన కావ్యానికి ఔచిత్యమే జీవితం.
ఆనందవర్థనుడి ధ్వని సిద్ధాంతాన్నే విశ్వనాధుడు,జగన్నాధపండితరాయలు మొదలైన అలంకారికులు ధ్వని ధ్వని సిద్ధాంతాన్ని అంగీకరించారు.అలంకార శాస్త్రం భరతుని రసమతంతో మొదలై ధ్వని మతంతో నిలిచిపోయింది.చివరగా ధ్వనియే కావ్యాత్మ అని అందరాలంకారికులు అంగీకరించారు.