కాసాని బ్రహ్మానందరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాసాని బ్రహ్మానందరావు లెటరింగ్‌ ఆర్టిస్ట్‌, పబ్లిసిటీ డిజైనర్‌. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఖతుల రూపకర్త. ఆయన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్ సోదరుడు. ఆరుగురు సోదరుల్లో చివరివాడైన బ్రహ్మానందరావు బ్రహ్మంగా సుపరిచితుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

పాలకొల్లులో జన్మించిన ఆయన చెన్నై వెళ్లి తన సోదరుడు ఈశ్వర్ వద్ద చీఫ్‌ అసిస్టెంట్‌గా చేరారు. లెటరింగ్‌ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదిం చుకున్న బ్రహ్మం కొన్నివేల చిత్రాలకు లోగోలు రాశారు. అంతేకాకుండా ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉపయోగిస్తున్న తెలుగు, తమిళ, కన్నడ ఫాంట్స్‌ను బ్రహ్మం రూపొందించి ‘అక్షరబ్రహ్మ’గా పేరు తెచ్చుకున్నారు.[2] ఆయన ఐదు భాషలలో 1000 చిత్రాలకు తన సోదరునితో పనిచేసారు. ఆయనకు విశేష కీర్తి తెచ్చిన సినిమాలు "శివ", "స్వాతి",, 'సుర్ సంగం'[3]

ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మరణం[మార్చు]

ఆయన తన 67వ యేట మార్చి 16 2013 న మరణించారు.[4]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]