Jump to content

కాసావారు

వికీపీడియా నుండి

కాసావారు వెంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, నూజివీడు, పెద్దాపురం, సైదాపురం తదితర వెలమ జమీందారీలలో 'కాసాకులం'వారు ఉండేవారు. వీరు జమీందారుల వద్ద సేవకవృత్తిలో ఉండేవారు. జమీందారులు, వారి బంధువులకు సంబంధించిన కుటుంబాలవారి సేవకవృత్తిలో బ్రతుకులీడ్చేవారు.శబ్దరత్నాకరంలో 'కాసా' పదానికి 'దాసీపుత్రుడు' అని అర్థం ఇవ్వబడింది. తైనాతులన్నా వీళ్ళే కాబోలు, అతితక్కువ జీతతోం,'రన్నింగ్ఎరండ్స్' ఉపయోగపడేవారు. 1930 జమీందారీ వ్యతిరేక ఉద్యమంలో వీరి సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. వెంకటగిరి నగిరిలో దాసీలను 'ఆడపాపాలు'అని పిలిచేవారు, వీరికి పెళ్ళిళ్ళులేవు, ఆడపాపాలకు ఆడపిల్లలు పుడితే వారిని కూడా ఆడపాపలుగా నియమించుకోనేవాళ్ళు.

'కాసావాని' అంటే కాసావానికి సంబంధించిన విషయం కావచ్చు. పూర్వం రాజులు, జమీందారులు ఏ జమీందారు కుమార్తెనో పళ్లిచేసుకున్నా, తమవద్ద పని చేస్తున్న పనివారిని, దాసీలను కూడ చేరదీసేవారు. జమీందారులు, రాజులవలకు దాసీలకు కలిగిన సంతానాన్ని 'కాసావారు' అనేవారు. దాసీ కుమార్తెల పాత్రలు తెలుగు పాత సినిమాలలో ఉన్నాయి. దాసీవ్యవస్థ కొనసాగింపే కాసా వ్యవస్థ. 18౦8 ప్రాంతంలో కల్నల్ కాలిన్ మెకంజీ గుమాస్తాలు వెంకటగిరి సీమలో సేకరించిన వివరాలలో కాసావారి గురించిన వివరాలు మెకంజీ దస్త్రాలలో భద్రంగా ఉన్నాయి. వెంకటగిరి రాచనగరులో 'బందీలు' అని షుమారు 200మంది ఆడవాళ్ళూ ఎటువంటి వేతనం లేకుండా పనిచేస్తున్నట్లు వెంకటగిరి kyfiyatలో నమోదయినది. వెంకటగిరి జమీందారు అంటే గిట్టని వాళ్ళు వెంకటగిరి కైఫియత్ ను 1909లో అచ్చువేసి దేశమంతటా పంచారు. జమీందారు వాటన్నింటినీ సేకరించి సంస్థానం గ్రంథాలయం 'సరస్వతీ నిలయం'లో భద్రపరచి ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు కాసాృత్తిలేదు, అడపాపలూ లేరు, ఆకులమూ లేదు.


మూలాలు: 1.డాక్టర్ కాళిదాసు పురుషోత్తం రచన "వెంకటగిరి సంస్థాన చరిత్ర- సాహిత్యం, సాహితి ప్రచురణ, హైదరరాబాదు, 2౦18. 2.వెంకటగిరి రాజుల వంశచరిత్రము, అవధానం శేషశాస్త్రి, వెల్లాల సదాశివశాస్త్రి, శారదాంబా విలాస ముద్రాక్షరశాల,చెన్నపురి, 191౦. ౩.వెంకటగిరి kyfiyat, మెకెన్జీ సంచయం, చెన్నయి.

"https://te.wikipedia.org/w/index.php?title=కాసావారు&oldid=4353780" నుండి వెలికితీశారు