కాస్టస్ ఇగ్నెయస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాస్టస్ ఇగ్నెయస్ అనే మొక్క శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో ఈ ఔషధ గుణాలు ఉన్న మొక్క సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్లే దీన్ని ‘ఇన్సులిన్ ప్లాంట్’ అని అంటారు. సాధారణంగా స్పైరల్ ఫ్లాగ్ అని పిలుస్తారు, కోస్టాసి కుటుంబానికి చెందినది . ఇన్సులిన్ మొక్కను మొట్టమొదటిగా అమెరికాలో కనుగొన్నారు. అక్కడ ఈ మొక్క విరివిగా లభిస్తుంటుంది. దక్షిణ, మధ్య అమెరికా నుండి భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన మొక్క . ఇది శాశ్వత, నిటారుగా, విస్తరించే మొక్క, ఇది రెండు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది,వరుసగా అమర్చిన ఆకులు ఆకర్షణీయమైన పువ్వులతో ఉంటుంది. ఈ పెద్ద, మృదువైన, ముదురు ఆకుపచ్చ ఆకుల యొక్క దిగువ భాగాలలో లేత ఊదా రంగు ఉంటుంది. ఆకులు కాండం చుట్టూ వృత్తాకారంగా అమర్చబడతాయి. ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. కాండం కోయడం ద్వారా మరో మొక్క చేయబడుతుంది. దీనికి సూర్యరశ్మి అవసరం అయితే, ఇది స్వల్పంగా నీడఉండే ప్రాంతాల్లో కూడా పెరుగుతుంది. దీనిని సంప్రదాయ వైద్యంలో ను, ఇతర చోట్లా అలంకారికఉపయోగం కోసం భారతదేశంలో సాగు చేస్తున్నారు.

కాష్టస్ ఇగ్నేయస్
ఇన్సులిన్ మొక్క

ఔషధ ఉపయోగాలు[మార్చు]

సిద్ధ వైద్యంలో దీనిని కోస్టం అంటారు.దీనిని కాశ్మీర్, హిమాలయ ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఇది జింజర్లకు సంబంధించినది ఇది మొదట జింజిబెరేసి కుటుంబంలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు కోస్టస్ జాతులు, ఆ తరగతికి చెందిన మొక్కలను ఒక స్వంత కుటుంబంగా కోస్టాసీగా తిరిగి వర్గీకరించారు.[1] ఈ జాతి రైజోమ్ ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తుంది, పక్షులు పండ్లను ఆహారంగా తీసుకున్నప్పుడు విత్తనాలను విసర్జిస్తుంది. కోస్టస్ ఉత్పత్తులను కొన్నిసార్లు కోస్టస్ కోమోసస్ అని పిలుస్తారు ఇవి ప్రకృతిలో తినదగినవి.వీటి పూల రేకులు పోషకాలతో కూడి తియ్యగా ఉంటాయి. ఈ మొక్క దక్షిణ భారతదేశంలో అలంకార మొక్కగా పెరుగుతుంది దీని ఆకులను మధుమేహ చికిత్సలో ఆహార పదార్ధంగా ఉపయోగిస్తారు ఈ మొక్క లో ఉన్న కోరోసాలిక్ ఆమ్లము శరీరంలో ఇన్సులిన్ ను అదుపులో వుంచుతుంది.[2] ఈ ఆకుల్లో ప్రోటీన్, ఐరన్, ఆకార్బిక్ యాసిడ్, ఎ-టోకోఫెరాల్, ß-కెరోటిన్, టెర్పెనాయిడ్ లు, స్టెరాయిడ్ లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ కాంపోనెంట్లు అధికంగా ఉంటాయి.[3] ఇది డయాబెటిస్‌ను నియంత్రించడానికి ఇది భారతదేశంలో ఉపయోగించబడుతుంది.[4] ఇది రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలో తగ్గించగలదు. అలాగే ఇన్సులిన్ పెరిగేలా చేస్తుంది. కొందరు ప్రజలు తమ రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉండటానికి రోజూ ఒక ఆకు తింటున్నారు.మధుమేహం ఉన్న వారు ఈ మొక్కను ఉపయోగించాలనుకుంటే సొంత వైద్యం తీసుకోవడం కంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.

ఇన్సులిన్ మొక్క వీడియో
ఇన్సులిన్ మొక్క వీడియో

మూలాలు[మార్చు]

  1. "Chamaecostus cuspidatus". alchetron.com. Retrieved 2020-08-04.
  2. "A review on Insulin plant (Costus igneus Nak)". www.ncbi.nlm.nih.gov.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Tony, Eswar. "CHAMAECOSTUS CUSPIDATUS – A SHORT REVIEW ON ANTI DIABETIC PLANT" (in ఇంగ్లీష్). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. "మధుమేహం తగ్గించే 'ఇన్సులిన్ మొక్క' ఆకులు.. రోజుకి ఒక్కటి తింటే చాలు!". Vigil Media (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-07-19. Retrieved 2020-08-04.[permanent dead link]