కితాబ్ (మలయాళ నాటకం)
కితాబ్ | |
---|---|
రచయిత | రఫీక్ మంగళస్సెరి |
తొలి ప్రదర్శన తేది | 2018 నవంబరు |
తొలి ప్రదర్శన స్థలం | వడకర, కేరళ |
ఒరిజినల్ భాష | మలయాళ భాష |
విషయం | ముస్లిము స్త్రీలకు లింగ సమానత్వం, లింగ న్యాయం |
కళా ప్రక్రియ | హాస్యం, యువత |
కితాబ్ (మలయాళం: കിത്താബ്) అనేది వివాదాస్పదమైన మలయాళ నాటకం. ఇస్లాము మతంలో మగవాళ్ళు మాత్రమే చదివే అజాన్ ను చదవాలని కలలుగనే ఒక బాలిక కథ ఇది. తన మతంలో మహిళను అణగదొక్కడాన్ని ప్రశ్నిస్తుంది ఆ బాలిక. తన స్నేహితులతో కలిసి నాట్యం చేసి, తనను తిననివ్వకుండా దాచిన ఆహారాన్ని దొంగిలించి, అజాన్ చదవనివ్వాలనే డిమాండు చేసీ.. ఆ బాలిక తన మతాచారాలపై తిరుగుబాటు చేస్తుంది.[1][2]
ఈ నాటకాన్ని స్క్రిప్టు రచయిత, దర్శకుడూ అయిన రఫీక్ మంగళస్సెరి రచించాడు.[3][4][5] శబరిమలలో స్త్రీలకు ప్రవేశం కల్పించాలంటూ, ఇస్లాము మతాచారాల్లో స్త్రీలకు పాల్గొనే హక్కు కావాలంటూ, స్త్రీలను ఇమాములుగా నియమించాలంటూ, మసీదుల్లో నమాజు చెప్పే హక్కు కావాలంటూ.. మహిళా హక్కుల ఉద్యమం రూపు దిద్దుకుంటున్న వేళ, 2018 నవంబరులో, ఈ పుస్తకం కేరళలో విడుదలైంది.[6]
స్ఫూర్తి
[మార్చు]ఈ నాటకం వాంగు అనే కథపై ఆధారపడినది కాదని, ఉన్ని.ఆర్ రాసిన ఆ కథను స్ఫూర్తిగా తీసుకుని స్వతంత్రంగా అల్లిన కథ అనీ రఫీక్ మంగళస్సెరి చెప్పాడు. అయితే, ఉన్ని.ఆర్ ఈ భావనను ఒప్పుకోలేదు. తన ఆలోచనలకు అనుగుణంగా ఈ నాటకం లేదని, ధార్మిక విలువలు ఈ నాటకంలో లేవనీ ఉన్ని.ఆర్ అన్నాడు.[7] వాంగు కథను సినిమాగా తీయాలని మలయాళ దర్శకుడు వి.కె.ప్రకాష్ ఆలోచిస్తున్నాడు.[8]
ఇతివృత్తం
[మార్చు]ఒక ముస్లిము బాలిక తన తండ్రిలాగా మెజ్జిన్‌గా మారి అజాన్ చదవాలని ఆశిస్తుంది. తల్లి ఇంట్లోని మగవాళ్ళ కోసం మాత్రమే వండిన చేపల వేపుడును దొంగిలిస్తుంది. అదేమీ తప్పు కాదని, ఆడపిల్లలకు సరిపడినంత ఆహారం ఇవ్వడం లేదని దేవుడికి తెలిసిందేననీ ఆమె అంటుంది. తండ్రి ఆమెను మందలిస్తాడు. మగవాళ్ళు తినేదానిలో సగమే ఆడవాళ్ళు తినాలని అతడు చెబుతాడు. మరి.. ఆడవాళ్ళు, మగవాళ్ళు ధరించే బట్టల్లో సగమే ఎందుకు ధరించకూడదూ అని ఆమె చిలిపిగా అడుగుతుంది.[9]
ఈ కష్టాల్లో ఉండగానే, అజాన్ చదవాలనే తన కోరికను ఆమె వెల్లడిస్తుంది. తండ్రి ఆమె ప్రశ్నలన్నిటికీ ఒక పెద్ద పుస్తకం (కితాబ్) లోని విషయాలను ఉదహరిస్తూ సమాధానాలు చెబుతాడు. ఆమెను పాఠశాలలో ఒక నాటకంలో పాత్ర వెయ్యకుండా ఆపుతాడు. అలాంటి పనులు చేస్తే ఆమె స్వర్గానికి వెళ్ళలేదని అతడు చెబుతాడు.[9]
"నేను ఆడి పాడినంత మాత్రాన స్వర్గానికి పోనట్లైతే, నాకా స్వర్గం వద్దు" అని ఆమె అంటుంది. తాను వారించినా, వినకుండా పాఠశాలలో నాటకంలో పాల్గొన్న కూతురును చంపేందుకు సిద్ధమౌతాడు, తండ్రి. అతడు కేవలం ముయెజ్జిన్ మాత్రమే కాదని, అతడామెకు తండ్రి కూడా అనీ భార్య గుర్తు చేస్తుంది. దాంతో అతడు కూతురును అజాన్ చదవనిస్తాడు. బాలిక అజాన్ చదవగా, ఇతరులు ప్రార్థిస్తూండగా నాటకం ముగుస్తుంది.[9]
వివాదాలు
[మార్చు]కోళికోడ్ గ్రామీణ ప్రాంతం లోని మేముండా ఉన్నత పాఠశాల జిల్లా స్థాయి నాటక పోటీల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఉత్తమ నాటకం, ఉత్తమ నటి పురస్క్జారాలు పొందింది. నాటకం ఇస్లాములో లింగ వివక్షతను విమర్శిస్తోంది కాబట్టి దాన్ని విమర్శించారు. మేముండా పాఠశాల పై స్థాయి పోటీల్లో పాల్గొనడాన్ని మత, రాజకీయ ఛాందసవాదులు విజయవంతంగా ఆడ్డుకున్నారు.[10][11] ఈ నాటకం మతపరమైన అసహిష్ణుత పైన, లింగ వివక్ష పైనా చర్చను లేవదీసింది. చివరకు నాటకాన్ని వేరే సమయంలో వేరే చోట ప్రదర్శించారు.[12]
కితాబ్ ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కితాబిళే కూర అనే ఒక నాటకం తెర మీదకు వచ్చింది. అందులో కూడా ఒక స్త్రీ పాత్ర మత స్వేచ్ఛకోరుతుంది. అబ్బాస్ కాలతోడ్ అనే మలయాళ నాటకరంగ కార్యకర్తకు ఈ రెండో నాటకం పట్ల ఆసక్తి ఏమీ లేదు. అయితే, కితాబ్‌ను కూడా అతడు విమర్శించాడు. ఇటీవల ముస్లిము మతంలో చోటుచేసుకుంటున్న అనేక మార్పులను కితాబ్ నాటకం పట్టించుకోలేదని అతడు విమర్శించాడు. "ముక్రీని విలనుగా చూపించడం సరికాదు. ఎంచేతంటే ముస్లిముల్లో ఇతర విలన్లు ఎదిగారు." అని కూడా అతడన్నాడు. దీన్ని మంగళస్సెరి ఒప్పుకోలేదు. "సామాజిక జీవనంలో ముస్లిములు క్రమేణా ఎదుగుతూ ఉన్నారనడం సరైనది కాదు. ఇతర మతాల్లో ఉన్నట్టుగానే ముస్స్లిముల్లోనూ మార్పులు చోటుచేసుకుని ఉండవచ్చు. కానీ తిరోగామి శక్తుల ప్రాబల్యం పెరిగిపోతోంది. ఒకప్పుడు కేరళలో చాలా తక్కువ మంది ధరించిన పరదా, ఇప్పుడు ముస్లిము మహిళకు గుర్తుగా మారింది. ముక్రి, మసీదులో ఒక ఉద్యోగి మాత్రమేనని నాకు తెలుసు. కానీ అతడు మతాధికారులకు ప్రతినిధి. ముస్లిములపై ఉక్కు లాంటి అతడి పట్టు ఇంకా బిగిసింది. ఈ మతానికి కొత్త దారులు చూపిస్తూ నాటకం ముగుస్తుంది."[13] "నాటక నేపథ్యం ముస్లిము కుటుంబం. కాబట్టి అది ముస్లిము జీవితాన్నే చూపిస్తుంది. ఏ మతాన్నీ కించపరచే ప్రయత్నం చెయ్యలేదు." అని అతడు చెప్పాడు.[14]
రాష్ట్ర స్థాయి వేదుకల్లో కితాబ్ ను ఉపసంహరించడంపై రచయితలు కె సచ్చిదానందన్, ఎస్.హరీష్ లు విమర్శించారు.[5][15] ప్రతాప్ జోసెఫ్ అనే ఛాయాగ్రాహకుడు ఉపసంహరణకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసాడు.
ఎ.శాంతకుమార్ అనే నాటక రచయిత ఫేస్‌బుక్‌లో ఇలా రాసాడు: "మత నాయకుల వత్తిడికి లొంగిపోయి, ఆ పాఠశాల నాటకాన్ని ఉపసంహరించుకుని చేతులు కడిగేసుకుంది." రచయిత రఫీక్ మంగళస్సెరిని ఏకాకిని చేసారని కూడా అతడు విమర్శించాడు. పునరుజ్జీవనం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు, మైనారిటీ ఛాందసవాదులు అతణ్ణి ఏకాకిని చెయ్యడం పట్ల మౌనంగా ఎందుకున్నారని అతడు ప్రశ్నించాడు.[5]
రఫీక్ మంగళస్సెరి
[మార్చు]రఫీక్ మంగళస్సెరి మలయాళ స్క్రిప్టు రచయిత, దర్శకుడు. మలప్పురం జిల్ల, చెట్టిపాడికి చెందినవాడు. అన్నపేరున అనే అతడి నాటకం ఓ వైపున జరుగుతున్న ఆహార వృథాను, మరో వైపున ఉన్న ఆకలినీ వివరిస్తుంది.[16] అతడు కొట్టెం కరీం కు దర్శకత్వం చేసాడు.[17]
జిన్ను కృష్ణన్ అనే నాటకానికి 2013 లో అతడు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[18][19] ఇరట్ట జీవితంగళిలూదె (రెండు జీవితాల ద్వారా) అనే సినిమాకు రాసిన స్క్రిప్టుకు గాను కేరళ సంగీత నాటక అకాడమీ వారి అత్యుత్తమ స్క్రిప్టు పురస్కారాన్ని అందుకున్నాడు.[20] బాలల నాటక రంగంలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.[21]
మూలాలు
[మార్చు]- ↑ "In Kerala's Kozhikode, a play about a girl who dreams about giving azaan call has Muslim conservatives up in arms". Firstpost. Retrieved 16 January 2019.
- ↑ "Kozhikode School Withdraws Play Calling out Gender Disparity After Muslim Groups Protest". Archived from the original on 2019-04-17. Retrieved 2019-02-24.
- ↑ "Kozhikode: SDPI, MSF up in arms against Kithab". Deccan Chronicle. 25 November 2018. Retrieved 16 January 2019.
- ↑ "Play showing girl performing 'azaan' raises conservatives' ire". The Times of India. Retrieved 16 January 2019.
- ↑ 5.0 5.1 5.2 Reporter, Staff; Jayanth, A. s (5 December 2018). "Campaign for Kithaab takes off". The Hindu. ISSN 0971-751X. Retrieved 16 January 2019.
- ↑ "In Kerala's Kozhikode, a play about a girl who dreams about giving azaan call has Muslim conservatives up in arms". Firstpost. Retrieved 16 January 2019.
- ↑ "Unni R short story Vanku to be adapted on screen by V K Prakash daughter Kavya Prakash Shabna Mohammed: വാങ്ക് വിളിക്കാൻ ആഗ്രഹിച്ച റസിയയുടെ കഥ സിനിമയാകുന്നു: ഉണ്ണി ആറിന്റെ കഥയ്ക്ക് ദൃശ്യഭാഷ്യമൊരുക്കാന് രണ്ടു പെണ്കുട്ടികള്". The Indian Express. Retrieved 17 January 2019.
- ↑ "Unni R short story Vanku to be adapted on screen by V K Prakash daughter Kavya Prakash Shabna Mohammed: വാങ്ക് വിളിക്കാൻ ആഗ്രഹിച്ച റസിയയുടെ കഥ സിനിമയാകുന്നു: ഉണ്ണി ആറിന്റെ കഥയ്ക്ക് ദൃശ്യഭാഷ്യമൊരുക്കാന് രണ്ടു പെണ്കുട്ടികള്".
- ↑ 9.0 9.1 9.2 "Following protests by Muslim groups Kozhikode school withdraws students play".
- ↑ "In Kerala's Kozhikode, a play about a girl who dreams about giving azaan call has Muslim conservatives up in arms".
- ↑ "After dropped by school Kalolsavam, 'Kithaab' to be staged across Kerala". The New Indian Express. Retrieved 16 January 2019.
- ↑ "ക്ലബുകളും വായനശാലകളും സാംസ്കാരിക സംഘടനകളും ഏറ്റടുത്തു; ബാലസംഘവും ഡിവൈഎഫ്ഐയും നാടകം പ്..."
- ↑ "Purdah phobia". 1 December 2018.
- ↑ "Kozhikode: SDPI, MSF up in arms against Kithab". Deccan Chronicle. 25 November 2018. Retrieved 16 January 2019.
- ↑ "Controversial play 'Kitab' dropped from Kerala school art festival".
- ↑ Krishnakumar, G. (7 January 2018). "The show will go on, with aplomb". The Hindu. ISSN 0971-751X. Retrieved 16 January 2019.
- ↑ "Kozhikode: SDPI, MSF up in arms against Kithab". Deccan Chronicle. 25 November 2018. Retrieved 16 January 2019.
- ↑ "2013–ലെ കേരള സാഹിത്യ അക്കാദമി അവാര്ഡുകള് പ്രഖ്യാപിച്ചു" (PDF). 20 December 2014.
- ↑ "Sahitya Akademi award for Meera's 'Aarachar'".
- ↑ Reporter, Staff (8 May 2018). "Beedi wins best short play award of akademi". The Hindu. ISSN 0971-751X. Retrieved 16 January 2019.
- ↑ "Ennu Mammali Enna Indiakkaran". Archived from the original on 2018-08-06. Retrieved 2019-02-24.